Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: అరణ్యం నుంచి దారి తప్పిన నెమలి..!
By: Tupaki Desk | 22 Feb 2021 3:21 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఖాన్ నటవారసురాలు సారా అలీఖాన్ బాలీవుడ్ లో మోస్ట్ ప్రామిస్సింగ్ హీరోయిన్ గా వెలిగిపోతున్న సంగతి తెలిసిందే. కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలో సారా ఇంతటి పాపులారిటీని సంపాదించడం ఆసక్తికరం.
వరుస విజయాలు ఈ అమ్మడికి పెద్ద ప్లస్. ఇక ప్రతిభ పరంగానూ సారా రేంజ్ వేరే లెవల్లో ఉందన్న టాక్ కూడా ఉంది. ఈ భామ సోషల్ మీడియాల్లోనూ అసాధారణ ఫాలోవర్స్ ని కలిగి ఉంది. ఈ వేదికపై రెగ్యులర్ ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా సారా ప్రఖ్యాత `ఎల్లే` కవర్ పేజీపై దర్శనమిచ్చింది. ఈసారి లుక్ సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఇంచుమించు నెమలి లుక్ ని ట్రై చేశాం! అంటూ డిజైనర్ టీమ్ చెబుతోంది.
నిజమే.. సారాని చూస్తుంటే ఈ లుక్ లో అచ్చం మయూరాన్ని తలపిస్తోంది. బ్లూ బికినీకి తగ్గట్టే పర్ఫెక్ట్ నెమలి పించం లుక్ తో డిజైన్ చేసిన ఆ డిజైనర్ టాప్ మైమరిపిస్తోంది. సారా ఒక రకంగా వండర్ ఉమెన్ నే గుర్తు చేస్తోంది.ఇక కెరీర్ మ్యాటర్ కి వస్తే సారా వరుస చిత్రాలతో బిజీగా ఉంది. కేదార్‌నాథ్ లో దివంగత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన నటించింది. ఆ తర్వాత మరో మూడు సినిమాల్లో నటించింది.
ఇక బాలీవుడ్ లో ఈ చిన్నపాటి కెరీర్ గురించి సారా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఎదిగే క్రమంలో విద్యలో రాణించాను. నాకు ఎప్పుడూ నటనపై ప్రేమ ఉన్నా.. హిందీ చిత్రంలో ప్రముఖ కథానాయికగా ఉండబోనని నాకు తెలుసు. కాబట్టి వేరే రంగంలోకి వెళతానని ఇంట్లో చెప్పాను. కానీ నటనలోకి ప్రవేశించాను.. అని సారా వెల్లడించింది.
సారా చివరిసారిగా కూలీ నంబర్ 1 లో కనిపించింది. డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వరుణ్ ధావన్ సరసన నటించింది. 2020 లో కార్తీక్ ఆర్యన్ సరసన లవ్ ఆజ్ కల్ లో నటించింది. అక్షయ్ కుమార్ - ధనుష్ లతో అట్రాంగి రే లో సారా కథానాయికగా కనిపించనుంది.