Begin typing your search above and press return to search.
స్టార్ కిడ్ లైఫ్ లెస్సన్ వ్వావ్!!
By: Tupaki Desk | 21 April 2019 10:32 AM GMTఒబేసిటీ అనేది నేటి తరంలో కామన్ ప్రాబ్లమ్ అన్న సంగతి తెలిసిందే. మారిన లైఫ్ స్టైల్.. కొత్త రకం తిండి విధానం అధిక బరువు సమస్యల్ని తెచ్చి పెడుతోంది. పిజ్జాలు.. బర్గర్ల కల్చర్ పై సాంప్రదాయవాదులు విరుచుకుపడేది ఇందుకే. అయినా పాశ్చాత్య ధోరణిని నేటితరం విడిచిపెట్టడం లేదు. అయితే అలాంటి వారందరూ స్టార్ కిడ్ సారా అలీఖాన్ లైఫ్ లెస్సన్ గురించి తెలుసుకుని తీరాల్సిందే. జీరో నుంచి ట్రాన్స్ ఫామ్ అయ్యి గ్లామరస్ హీరోయిన్ అవ్వకముందు సదరు బ్యూటీ ఎన్ని తంటాలు పడిందో తెలుసా? ఎంతో క్రమశిక్షణ ఆహార నియమాల్ని పాటించి 96 కేజీల బరువు నుంచి ఎంతో తగ్గింది. కేవలం యాటిట్యూడ్ లో మార్పుతోనే ఈ బ్యూటీ తనని తాను ఫిట్ అని నిరూపించుకుంది.
పటౌడీ సైఫ్ అలీఖాన్ నటవారసురాలిగా బాలీవుడ్ లో ఆరంగేట్రం చేసిన సారా అలీఖాన్ తాజా లుక్ అందరికీ బిగ్ షాకింగ్ అనే చెప్పాలి. సారా ఇప్పటికే కేదార్ నాథ్ - సింబా లాంటి చిత్రాలతో బెస్ట్ డెబ్యూ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు డ్రమ్ములా ఉండేది! అని విమర్శించిన నోళ్లే అవాక్కయ్యేంతగా మారిన సారా .. ప్రస్తుతం బాలీవుడ్ లో కెరీర్ ని బెస్ట్ గా ప్లాన్ చేసుకుంటోంది. అయితే తనలో అంత పరివర్తన వెనక కఠోర సత్యాల్ని సారా స్వయంగా రివీల్ చేసింది.
పీసీఓడీ (PCOD -పోలిసైటిక్ ఓవరీ సిండ్రోమ్) అనే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య వల్ల తాను అధిక బరువుతో బాధపడ్డానని తెలిపిన సారా .. శ్రీలంక- కొలంబోలో నాలుగేళ్ల డిగ్రీ చదివాను. ఆ తర్వాత ఫైనల్ ఇయర్ ని అమెరికాలో చదివేప్పుడు బరువు తగ్గించుకునే ప్రయత్నం చేశానని తెలిపింది. నేను ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నా.. అధిక బరువు వల్ల ఎవరో ఏదో అంటారనే భయం వెంటాడేది. దాంతో బరువు తగ్గేందుకు కసరత్తులు ప్రారంభించాను. తినే ఆహారంలో మార్పులు చేశాను. పిజ్జా తినే బదులు ప్రొటీన్ షేక్ తీసుకున్నా. చాక్లెట్లు తినే బదులుగా సలాడ్లు తిన్నాను. క్రమశిక్షణతో వర్కవుట్లు చేసేదానిని.. అలా హార్మోనల్ సమస్యనుంచి బయటపడి బరువు తగ్గానని వెల్లడించింది. అధిక బరువు నుంచి బయటపడిన ఇతర కథానాయికల్లో సోనమ్ కపూర్ పేరు ప్రముఖంగా వినిపించింది. సోనాక్షి.. పరిణీతి లాంటి భామలు బొద్దుతనం తగ్గించుకునేందుకు ఫిట్ నెస్ తరగతులకు వెళ్లిన సంగతి తెలిసిందే.