Begin typing your search above and press return to search.
షారూఖ్ ను అంకుల్ అని పిలిచింది.. ట్రోలింగ్ స్టార్ట్!
By: Tupaki Desk | 31 March 2019 8:04 AM GMTసోషల్ మీడియా జెనరేషన్ లో సెలబ్రిటీలు ఎవరైనా ట్రోలింగ్ బారిన పడకుండా తప్పించుకోలేరు. తాజాగా సైఫ్ అలీ ఖాన్ కూతురు.. బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ కు ఈ పరిస్థితి ఎదురైంది. ఇంతకీ ఆమె చేసిన పొరపాటు ఏంటంటే బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ను 'అంకుల్' అని సంబోధించడం.
డీటెయిల్స్ లోకి వెళ్తే రీసెంట్ గా ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్ కు ప్రముఖ బాలీవుడ్ నటులు చాలామంది హాజరయ్యారు. ఫిలింఫేర్ అవార్డ్స్ ఫంక్షన్ గురించి ఒక రిపోర్టర్ తో మాట్లాడుతూ " షారూఖ్ అంకుల్ తో కలిసి మానాన్నహోస్ట్ చేయడం నాకు చాలా నచ్చేది" అంటూ క్యాజువల్ గా చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో భారీగా చర్చలు మొదలయ్యాయి. సారాపై మండిపడిన షారూఖ్ ఫ్యాన్స్ 'సర్ అని పిలవొచ్చు కదా.. అంకుల్ అని పిలిచేదేంటి' అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. కానీ కొందరు మాత్రం సారాకు మద్దతుగా నిలిచారు. సారా వయసు 23.. షారూఖ్ వయసు 53 అయినప్పుడు ఆయనను అంకుల్ అని పిలవడంతో తప్పేముందని అన్నారు. కొందరైతే ఇంకా ముందుకెళ్ళి సారా ఫాదర్ సైఫ్ కంటే షారూఖ్ పెద్దవాడని అలాంటప్పుడు అంకుల్ అని పిలవడం తప్పేమీ కాదని సమర్థించారు.
ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ షారుఖ్ అభిమానులకు పంటికిందరాయిలా మారింది. అసలే హిట్లు లేక.. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలను వదిలేసుకుంటూ కెరీర్లో ఇబ్బందిపడుతున్న షారూఖ్ ఖాన్ ను చూసి ఫ్యాన్స్ తీవ్రమైన గా నిరాశలో ఉన్నారు.. ఇలాంటి సమయంలో షారూఖ్ ఖాన్ వయసును మరోసారి అందరికీ గుర్తుచేసేలా ఈ సంఘటన జరగడం వారిని ఇంకా బాధిస్తోంది.