Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: ఫెమినా ఆన్ ఫైర్

By:  Tupaki Desk   |   8 Aug 2019 5:08 PM GMT
ఫోటో స్టొరీ: ఫెమినా ఆన్ ఫైర్
X
బాలీవుడ్ లో ఈమధ్య చాలమంది స్టార్ కిడ్స్ ఎంట్రీ ఇచ్చారు కానీ వారిలో సక్సెస్ అయింది మాత్రం కొందరే. ఆ కొందరిలో సారా అలీ ఖాన్ ఒకరు. సైఫ్ అలీ ఖాన్- అమృతా సింగ్ ల ముద్దుల కూతురు సారా. డెబ్యూ సినిమా 'కేదార్ నాథ్' తో పాటు సెకండ్ ఫిలిం 'సింబా' కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవడంతో బాలీవుడ్ మేకర్ల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఈ జెనరేషన్ స్టార్ కిడ్ కదా.. మ్యాగజైన్ కవర్ పేజిలపై మెరవడాలు.. సోషల్ మీడియాలో సెగలు రేపడాలు చాలా కామన్.

ఇప్పటికే ఫిలింఫేర్.. వోగ్ లాంటి పాపులర్ మ్యాగజైన్ల కవర్ పేజీలపై దర్శనమిచ్చిన ఈ భామ తాజా ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజిపై కూడా మెరిసింది. ఫెమినా ఆగష్టు ఎడిషన్ కవర్ పేజికోసం ఒక అందమైన డిజైనర్ డ్రెస్ ధరించి సూపర్ పోజిచ్చింది. ఈ మ్యాగజైన్ లో 'సారా అలీ ఖాన్: రైజింగ్ స్టార్' అంటూ సారా పై ఒక కథనాన్ని కూడా ప్రచురించారు. ఇక ఫోటో విషయానికి వస్తే యమా సెక్సీగా ఉంది. లైట్ గ్రీన్ - వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న ఒక వెరైటీ డ్రెస్ లో వయ్యారంగా నిలబడింది. టాప్ అంటూ స్పెషల్ గా వేసుకోలేదు. ఇన్నర్ వేర్ మాత్రమే ఉంది కానీ ట్రాన్స్ పరెంట్ గా ఉండే స్లీవ్స్ వల్ల అదేదో కొత్తరకం టాప్ లా కనిపిస్తోంది. ఇక లెహెంగా కూడా ఒక ప్రత్యేకమైన డిజైన్ లో డిఫరెంట్ గా ఉంది. ఈ డ్రెస్ కు తగ్గట్టుగా ఒక సెక్సీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.

ఈ ఫోటోకు వన్ మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. వరుణ్ ధావన్.. షిబాని దండేకర్ లాంటి సెలబ్రిటీలు కూడా లైక్ బటన్ నొక్కడం విశేషం. సాధారణ నెటిజన్లు కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. "అమేజింగ్ కవర్ పేజ్".. "ఫెమినా ఆన్ ఫైర్".. "హాటెస్ట్ స్టార్ కిడ్" అంటూ పొగడ్తలు కురిపించారు. ఇక సారా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో 'లవ్ ఆజ్ కల్' సీక్వెల్ లో నటిస్తోంది. ఈ సినిమా కాకుండా గోవిందా నటించిన సూపర్ హిట్ 'కూలీ నెం.1' రీమేక్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.