Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : స్టార్ తనయ సోకుల హంగామా..!

By:  Tupaki Desk   |   24 Nov 2022 6:41 AM GMT
ఫోటో స్టోరీ : స్టార్ తనయ సోకుల హంగామా..!
X
బాలీవుడ్ గ్లామర్ క్వీన్ స్టార్ తనయ సారా అలి ఖాన్ వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. స్టార్ హీరోయిన్ గా బాలీవుడ్ ని ఏలాలని ఫిక్స్ అయిన సారా సినిమాల సెలక్షన్స్ లో కూడా తన మార్క్ చూపిస్తుంది. స్టార్ తనయురాలైనా సరే యువ హీరోలతో నటిస్తూ అలరిస్తుంది అమ్మడు. మొదటి సినిమాతోనే తన నటనకు గాను ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సారా ప్రతి సినిమాలో తన స్పెషాలిటీ చాటుతూ వస్తుంది. ఐదు సినిమాలతోనే బాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీగా క్రేజ్ తెచ్చుకున్న సారా కెరీర్ స్ట్రాంగ్ చేసుకునే ప్రయత్నాల్లో ఉంది.

ప్రస్తుతం అమ్మడు విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న సినిమాలో నటిస్తుంది. ఈ మూవీని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక ఈ మూవీతో పాటుగా గాస్ లైట్ సినిమా కూడా చేస్తుంది సారా అలి ఖాన్.

ఒకదాని వెంట ఒక సినిమా చేస్తూ కెరీర్ బిజీగా చేసుకున్న స్టార్ తనయ ఫ్రీ టైం లో ఫోటో షూట్స్ కి తగిన ప్రాధాన్యత ఇస్తుంది. సారా చేస్తున్న హాట్ ఫోటో షూట్స్ కి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. స్టార్ తనయగా సారా గ్లామర్ షో కొంతమందికి నచ్చకపోయినా మేజర్ ఆడియన్స్ ఆమె అందాల ప్రదర్శనని ఆస్వాదిస్తున్నారు.

లేటెస్ట్ గా సారా మరో గ్లామర్ లుక్ తో దర్శనమిచ్చింది. బ్లాక్ టాప్ అది కూడా స్లీవ్ లెస్ గా.. రెడ్ కలర్ మిడ్డీ.. థైస్ కనిపించేలా అమ్మడు చేస్తున్న హాట్ షో వైరల్ గా మారింది. ఈ ఫోటో షూట్స్ వల్ల సారా అలి ఖాన్ మైలేజ్ మరింత పెరుగుతుందని చెప్పొచ్చు.

బాలీవుడ్ భామల ఫోటో షూట్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. వారికి అనుగుణంగానే సారా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. సినిమాల్లో కన్నా ఫోటో షూట్స్ తోనే భామలు తమ అందాలకు ఎక్కువ పని చెబుతున్నారు. వారి సారా కూడా స్పెషల్ హాట్ షోతో హంగామా చేస్తుంది.

ఒకప్పుడు సినిమా రిజల్ట్స్ తో కెరీర్ గ్రాఫ్ ఉండేది కానీ ఇప్పుడు సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా ఏ హీరోయిన్ ఎన్ని ఎక్కువ ఫోటో షూట్స్ చేస్తే అంత ఎక్కువ అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. ఫోటో షూట్స్ తో క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత మూవీ ఆఫర్లు దక్కించుకుంటున్నారు. సారా కూడా అదే పంథా కొనసాగిస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.