Begin typing your search above and press return to search.

ఆ సినిమాలు చూసి అమ్మానాన్న చెడ్డవారని మాట్లాడ్డం మానేశా

By:  Tupaki Desk   |   3 Nov 2021 10:00 AM GMT
ఆ సినిమాలు చూసి అమ్మానాన్న చెడ్డవారని మాట్లాడ్డం మానేశా
X
లోకజ్ఞానం తెలియని వారు.. పల్లెటూరుకు చెందిన కొందరు సినిమాల్లో కొన్ని విషయాలు.. సన్నివేశాలు చూసి అవి నిజంగానే జరుగుతున్నాయని.. ఆ సన్నివేశాల్లు కనిపించే వారు నిజంగానే అలాంటి వారు అని భ్రమ పడుతూ ఉంటారు. అప్పట్లో కొందరు పల్లెటూరు వారు సినిమాల్లో విలన్ గా నటించిన నటీ నటులను పట్టుకుని కొట్టిన సందర్బాలు కూడా చాలా ఉన్నాయి. అలాంటి సంఘటన తన నిజ జీవితంలో జరిగిందని.. తన చినప్పటి విషయాన్ని బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ.. క్యూట్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌ వెళ్లడించింది. సారా అలీ ఖాన్‌ తండ్రి సైఫ్ అలీ ఖాన్ మరియు తల్లి అమృతా సింగ్‌ ఇద్దరు కూడా ఇండస్ట్రీకి చెందిన వారే అనే విషయం తెల్సిందే. ఇద్దరు చాలా సినిమాల్లోనే నటించారు. సారా అలీ ఖాన్‌ చిన్న తనంలో తన తండ్రి నటించిన ఓంకారా సినిమాను మరియు తల్లి నటించిన కల్యూగ్ సినిమాను చూసిందట.

ఓంకారా సినిమాలో సైఫ్ అలీ ఖాన్ చాలా మాసీ పాత్రను పోషించాడు. అందులో సైఫ్‌ ఎప్పుడు బూతులు తిడుతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. దాంతో నిజ జీవితంలో కూడా నాన్న అలాగే మాట్లాడుతూ ఇతరుల పట్ల అలాగే ప్రవర్తిస్తాడేమో అని భావించేదాన్ని. ఇక అమ్మ నటించిన కల్యూగ్‌ సినిమా కూడా నాలో చెడు భావనలు నింపింది. ఎందుకంటే ఆ సినిమాలో అమ్మ ఒక పోర్న్‌ సైట్ నిర్వహకురాలిగా నటించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అమ్మ నటించడం వల్ల చిన్నప్పుడు నిజంగానే అమ్మ అలాంటిదేమో అనుకున్నాను. ఆ సమయంలో కొన్నాళ్ల పాటు నేను అమ్మా నాన్నలతో సరిగా ఉండలేక పోయేదాన్ని. వారిద్దరి నుండి కాస్త దూరంగా ఉండేందుకు ప్రయత్నించేదాన్ని అంటూ సారా అలీ ఖాన్ తాజాగా ఒక కార్యక్రమంలో చెప్పుకొచ్చింది.

ఇద్దరి గురించి కలిగిన భావనలు నాలో మెల్ల మెల్లగా తగ్గడం మొదలు అయ్యింది. ఎందుకంటే నేను పెరిగి పెద్ద అవుతున్న సమయంలో నాకు లోక జ్ఞానం తెలిసింది. సినిమాలు ఏంటీ.. వాటిల్లో నటించడం ఏంటీ.. అందులోని పాత్రలు ఎలా ఉంటాయి. నిజ జీవితంకు సినిమా పాత్రలకు సంబంధం లేదు అని నేను గ్రహించాను. అప్పటి నుండి అమ్మా నాన్నలతో మళ్లీ సన్నిహితంగా ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. మొత్తానికి తన చిన్నతనంలో అమాయకత్వంతో ఆలోచించిన విధానంను తనకు తానుగా చెప్పి అందరిని ఆశ్చర్యపర్చింది. సారా అలీ ఖాన్‌ మాత్రమే కాకుండా ఇప్పటికి చాలా మంది పిల్లలు అలాంటి మనస్థత్వంను కలిగి ఉంటారు. సినిమాల్లో సీరియల్స్ లో ఉండే సూపర్ పవర్‌ సూపర్ హీరోలు నిజంగా ఉంటారని.. నా తండ్రి అలా ఎందుకు కాదని బాధపడే వారు కూడా ఉన్నారు.