Begin typing your search above and press return to search.
అమ్మా నాన్నలను బ్లాక్ మెయిల్ చేసిన కుర్ర హీరోయిన్
By: Tupaki Desk | 31 March 2023 6:00 PM GMTసెలబ్రిటీ విడాకులపై నిరంతరం ఏదో ఒక వార్త అభిమానులను కలచి వేస్తూనే ఉంది. కానీ తల్లిదండ్రుల బ్రేకప్ వ్యవహారంతో పిల్లలు నలిగిపోవడం సాధారణ విషయం కాదు. ఆ లోటు పూడ్చలేనిది. తల్లి ఒక చోట.. తండ్రి మరో చోట.. ఇరువురి ఆప్యాయతానురాగాలు ఎల్లవేళలా పొందలేకపోవడం పిల్లల దురదృష్టం.
ఇలాంటి దుస్థితిని బాలీవుడ్ స్టార్ హీరోలు సైఫ్ అలీఖాన్.. అమీర్ ఖాన్ వారసులు ఎదుర్కొన్నారు. స్టార్లుగా బిజీలైఫ్ తో కిడ్స్ కి దూరమవ్వడం ఒక శాపం కాగా.... విడాకులు పిల్లలకు అదనపు శాపంగా మారుతుంది. సారా అలీఖాన్- ఇబ్రహీం అలీఖాన్ తల్లిదండ్రులు సైఫ్ అలీ ఖాన్ - అమృతా సింగ్ విడిపోవడంతో మానసిక సమస్యలను ఎదుర్కొన్నట్టు సారా వెల్లడించారు.
అంతేకాదు తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసేందుకు తాను తన సోదరుడు `విక్టిమ్ కార్డ్` ప్లే చేసేవారమని సారా అలీఖాన్ తాజా ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. సారా ఇటీవల తన చిన్ననాటి రోజులను తిరిగి గుర్తు చేసుకున్నారు.
విడాకులు తీసుకున్న తన తల్లిదండ్రులు సైఫ్ అలీ ఖాన్ -అమృతా సింగ్ లను తమకు అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఎలా బ్లాక్ మెయిల్ చేసేవారో గుర్తు చేసుకున్నారు.
ఒక ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల తర్వాత సైఫ్ తన పిల్లలకు దూరమయ్యారు. వారితో పరిచయం లేకుండా దూరంగా ఉన్నందున.. సారా తన తల్లిదండ్రులను `గ్యాస్ లైట్`(సారా నటించిన తాజా సినిమా)లా ఉంచానని అంగీకరించింది.
తాను తన సోదరుడు ఇబ్రహీం అలీ ఖాన్ ఎల్లప్పుడూ బాధితుల కార్డు (విక్టిమ్ కార్డ్)ను ప్లే చేస్తామని తద్వారా తమ తల్లిదండ్రులు తామేం కోరుకున్నా అది కొని ఇచ్చేవారని సారా అలీఖాన్ చెప్పింది. ఓవైపు సారా నటించిన గ్యాస్ లైట్ రిలీజ్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న సారా తమ కుటుంబంలోని చాలా రహస్యాలను కూడా బహిర్గతం చేయడం చర్చగా మారింది.