Begin typing your search above and press return to search.

డేటింగ్ చేసింది అతనితో మాత్రమే

By:  Tupaki Desk   |   29 Jan 2019 2:30 PM GMT
డేటింగ్ చేసింది అతనితో మాత్రమే
X
బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్ 'కేదార్ నాథ్' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతోనే విజయం సాధించిన ఈ స్టార్ కిడ్ రెండో సినిమా 'సింబా' తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాల విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న సారా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తన లవ్ స్టొరీ గురించి ఓపెన్ అయింది.

మూడేళ్ళ క్రితం సారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వక ముందు మాజీ కేంద్ర మంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు వీర్ పహారియా తో ప్రేమాయణం సాగించిందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సారా తాజగా కన్ఫాం చేసింది. ఇంతవరకూ తన లైఫ్ లో డేటింగ్ చేసింది వీర్ ను మాత్రమే అని.. అతను తప్ప తనకు మరెవరూ బాయ్ ఫ్రెండ్స్ లేరని తెలిపింది. అంతే కాదు తన హృదయం ఎప్పుడు గాయపడలేదని కూడా తెలిపింది. ఈమధ్య సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో డేటింగ్ చేస్తోందని రూమర్లు వినిపిస్తున్నాయి. ఈలెక్కన సుశాంత్ ప్రేమాయణం వార్తలను పరోక్షంగా ఖండించినట్టే.

ఇదిలా ఉంటే ఈ వీర్ పహారియా సోదరుడు శిఖర్ పహారియా ప్రస్తుతం శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ తో డేటింగ్ చేస్తున్నాడని బాలీవుడ్ లో రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ షిండే గారి మనవళ్ళ జోరు మామూలుగా లేదే.