Begin typing your search above and press return to search.
ఇల్లరికం వచ్చేవాడినే పెళ్లాడుతుందట
By: Tupaki Desk | 4 Dec 2021 11:30 PM GMTబాలీవుడ్ యంగ్ బ్యూటీ...సైఫ్ అలీఖాన్ డాటర్ సారా అలీఖాన్ కెరీర్ జెట్ స్పీడ్ తో పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. `కేదారనాథ్` సక్సెస్ తో ప్రారంభమైన సారా ప్రస్థానం అటుపై ``సింబా`..`లవ్ ఆజ్ కల్` సక్సెస్ తో మరింత స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం అక్షయ్ కుమార్..దనుష్ కథానాయకులుగా నటిస్తోన్న `అట్రాంగిరే`లో నటిస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది.
దీనిలో భాగంగా యూనిట్ ప్రచారం పనులు వేగవంతం చేసింది. ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ కాబోయే వరుడు గురించి ఓ ఆసక్తికర సంగతి రివీల్ చేసింది. సారాని పెళ్లి చేసుకునే వాడు ఎవరైనా సరే తన తల్లి అమృతా సింగ్ నుంచి మాత్రం దూరం చేయకూడదని పెళ్లి ముందే కండీషన్ పెడుతుందిట.
తల్లి తో కలిసి తను కూడా జీవించాలని అంటోంది. తల్లిని ఒంటరిగా వదిలి రాలేనని...ఆ విషయాలన్ని కాబోయే వాడికి ముందుగానే చెప్పి ఒప్పిస్తాననని.. అలా కుదరని పక్షంలో పెళ్లి కూడా చేసుకోనని కరాఖండీగా చెప్పేసింది. ఒక వేళ సారా కండీషన్ కి ఒప్పుకోకపోతే చేసుకునే వాడు ఇల్లరికం రావాలేమో.
అలా వస్తే అన్ని రకాల సౌకర్యాలు అమృతా సింగ్ తప్పక కల్పించాల్సి ఉంటుంది. పెళ్లికి ముందు కుమార్తెలు చాలా మంది ఇలాగే ఉంటారు. కొంత మంది మాత్రమే కఠినంగా వ్యవహరించి పెళ్లి చేసుకోకుండా తల్లితోనే కలిసి జీవిస్తారు. ఆ కోణంలోనే సాయి పల్లవి కూడా ఉంది.
పెళ్లి చేసుకుంటే పుట్టినిల్లు వదిలేసి మెట్టినింటికి వెళ్లాలి కాబట్టి పెళ్లి అనే ఆలోచన తన మనసులోకి రానివ్వనని చాలా ఇంటర్వ్యూల్లో తెలిపింది. పెళ్లికి ముందు ఇలాంటి క్లారిటీ ఉండటం చాలా మంచిది.
లేకపోతే ఆ కారణంగాను విడాకుల వరకూ దారి తీసిన జంటలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు కాపురాల్ని కుమార్తెలకు బుదులుగా తెరవెనుక ఉండి తల్లులు నడిపిస్తున్నారన్న విమర్శ జోరుగా వినిపిస్తోంది.