Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సినిమాల్లోకి రాకముందే సెగలు

By:  Tupaki Desk   |   22 July 2017 1:10 PM GMT
ఫోటో స్టోరి: సినిమాల్లోకి రాకముందే సెగలు
X
బాలీవుడ్ లో వారసుల కంటే వారసురాళ్లే ఎక్కువ క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ - శతృఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా ఇప్పటికే టాప్ హీరోయిన్ లీగ్ లోకి వచ్చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ శక్తికపూర్ తనయ శ్రద్ధ కపూర్ కూడా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. లేటెస్ట్ గా సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేసింది.

వీరి విజయాలను స్ఫూర్తిగా తీసుకుని మరింతమంది వారసురాళ్లు తెరపై తారలుగా వెలిగిపోవాలని ఆరాటపడుతున్నారు. వీరిలో హీరో సైఫ్ ఆలీఖాన్ కుమార్తె సారా ఆలీఖాన్ పేరు ప్రముఖంగానే వినిపిస్తోంది. సైఫ్ ఆలీఖాన్ మొదటి భార్య అమృతాసింగ్ కు పుట్టిన సంతానమే సారా. తాజాగా తల్లి అమృతా సింగ్ తో కలిసి సారా ముంబయిలో ఓ ఫ్యాషన్ ఈవెంట్ కు వచ్చింది. ఈ షోలో సారా గ్లామర్ టాప్ అట్రాక్షన్ మారింది. పింక్ కలర్ లెహంగా పై ట్రాన్స్ పరెంట్ టాప్ తో అందరి మతులు పోగొట్టుకునేలా కనిపించిన సారాకు హీరోయిన్ కు ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ ఉన్నాయని కితాబిచ్చేశారు.

ఈ రోజుల్లో హీరోయిన్ కావాలంటే గ్లామర్ కంటెంట్ పుష్కలంగా ఉండాలి. దాంతో అందాలను ఆరబోయడం బాగా తెలిసుండాలి. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగిన సారాకు ఈ విషయం బాగానే వంటబట్టినట్టుంది. అందుకే పబ్లిక్ ఫంక్షన్ లోనే క్లీవీజ్ సోకులతో సహా తనలోని గ్లామర్ కంటెంట్ మొత్తం బయటపెట్టింది. ఇంక దర్శక నిర్మాతలదే ఆలస్యంమరి.