Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: యోగాతో కాదు నవ్వి నవ్వి చంపేస్తోంది!
By: Tupaki Desk | 23 Jun 2021 1:30 PM GMTబాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటవారసురాలిగా సారా అలీఖాన్ కెరీర్ గ్రాఫ్ గురించి తెలిసిందే. నెపోటిజం కొంతవరకే ఎక్కడైనా.. ప్రతిభతో నిరూపించుకుంటేనే ఇప్పుడున్న ఠఫ్ కాంపిటీషన్ లో ముందుకు సాగేది. ఇక తనదైన అందం చందం ప్రతిభతో రాణిస్తున్న యువనాయికగా సారా అలీఖాన్ కి ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. ఈ భామ ఇతర నాయికలతో ధీటుగా పోటీపడుతూ కెరీర్ పరంగా బిజీగా ఉంది. సోషల్ మీడియాల్లోనూ చాలా స్పీడ్ గా ఉంది.
నిన్నటిరోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సారా అలీఖాన్ షేర్ చేసిన యోగాభ్యాస ఫోటోలు అంతర్జాలాన్ని షేక్ చేసాయి. రకరకాల భంగిమల్లో యోగా ప్రాక్టీస్ చేస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఈ స్టార్ కిడ్ ఎంతో హాట్ గా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేసారు.
అందంగా కనిపించడమే కాదు..రకరకాల భంగిమలతో పిచ్చెక్కించడమే కాదు.. చిరునవ్వులు చిందిస్తూ కూడా ఈ అమ్మడు మనసు దోచేస్తుంది. యోగా కంటే చిరునవ్వులతోనే ఎంతో పాపులరైపోతోంది. ప్రస్తుతం సారా యోగాభ్యాస ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. సారా ఇప్పుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న `అట్రాంగి రే`లో నటిస్తోంది. ధనుష్ - అక్షయ్ ఇందులో కథానాయకులు. ఈ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఈ బ్యూటీ ఉవ్విళ్లూరుతోంది.