Begin typing your search above and press return to search.
భీష్మ లిరిక్: సరా సరి గుండెల్లో దించావే..
By: Tupaki Desk | 9 Feb 2020 3:53 PM GMTనితిన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా భీష్మ. రష్మిక మందన కథానాయిక. వెంకీ కుడుముల దర్శకుడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈనెల 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రిలీజవుతోంది. ఈ సందర్భంగా పోస్టర్ ప్రచారం.. లిరికల్ ప్రచారం వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇంతకుముందు రిలీజైన వ్వాటే బ్యూటీ లిరికల్ వీడియో నితిన్ అభిమానుల్లోకి జోరుగా దూసుకెళ్లింది. సాంగ్ మేకింగ్ వీడియో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో నితిన్ - రష్మిక రొమాన్స్.. రష్మిక అందాల ట్రీట్ గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా మహతి సాగర్ వినసొంపైన బాణీ మైమరిపించింది. తాజాగా ఈ చిత్రం నుంచి సరా సరి.. అంటూ సాగే ఓ మెలోడీ ని రిలీజ్ చేశారు. పాట ఆద్యంతం ఆహ్లాదకరమైన ట్యూన్ తో మైమరిపిస్తోంది.
ఎంతో క్యాచీగా ఉన్న ట్యూన్.. దానికి తగ్గట్టే పల్లెటూరి నేపథ్యంలోని విజువల్స్ మనసు దోచేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ``సరా సరి గుండెల్లో దించావే.. సరా సరి మైకంలో ముంచిందే..అయినా గానీ ఈ బాధ బావుందే..`` అంటూ అద్భుతమైన పదజాలంతో లిరిక్ మైమరిపించింది. బ్యాచిలర్ నితిన్ లోని ఒరిజినల్ ఫీలింగ్స్ ని శ్రీమణి బాగానే బుర్రకు ఎక్కించుకుని చక్కని పదాల అల్లికతో లిరిక్ ని రాశాడు. ఇక ఈ లిరిక్ కి తగ్గట్టే అనురాగ్ కులకర్ణి మెలోడియస్ టోన్ మైమరిపించింది. ఈ పాటను శేఖర్ మాస్టార్ చక్కని లొకేషన్స్ ఎంపిక చేసుకుని తెరకెక్కించారని విజువల్స్ చెబుతున్నాయి. సాంగ్ వినేందుకు ఎంతో సరళంగా ఉందో అంతకుమించి క్యాచీగా ఉంది. ఇక గందరగోళం గజిబిజి టోన్ ఎక్కడా వినబడకపోవడం ప్లస్. పాటల ప్రచారం సరిపోదు.. నితిన్ అభిమానులు ఆవురావురు మంటూ ఉన్నారు. ప్రచారం పరంగా మరింత దూకుడు పెంచాల్సి ఉంటుందేమో!