Begin typing your search above and press return to search.

అమ్మాయే స‌న్న‌గా అర‌న‌వ్వే న‌వ్వ‌గా..!

By:  Tupaki Desk   |   7 Aug 2022 11:30 PM GMT
అమ్మాయే స‌న్న‌గా అర‌న‌వ్వే న‌వ్వ‌గా..!
X
అమ్మాయే స‌న్న‌గా అర‌న‌వ్వే న‌వ్వ‌గా.. మ‌తి తప్పి కుర్రాళ్లే మంచాన ప‌డ్డారే..! ఖుషీ నుంచి బంప‌ర్ హిట్ ట్యూన్ ఇది. మ‌ణిశ‌ర్మ అద్భుత‌మైన బాణీతో క‌ట్టి ప‌డేసారు. అయితే ఇప్పుడు క్రికెట్ గాడ్ స‌చిన్ టెండూల్క‌ర్ గారాల త‌నయ.. కాబోయే హీరోయిన్ సారా టెండూల్క‌ర్ అర‌న‌వ్వు న‌వ్వ‌గానే కుర్రాళ్లు మ‌తి త‌ప్పి ప‌రేషాన్ అయిపోతుండ్రు!!

ఆ ఒక్క న‌వ్వు చాలు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అంటూ ఈ ఫోటోకి కాంప్లిమెంట్లు ఇచ్చేస్తున్నారు! సారా టెండూల్క‌ర్ స్వ‌యంగా ఇన్ స్టాలో ఈ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి ఎగ్జ‌యిటింగ్ గా ఓ విష‌యాన్ని తెలియ‌జేసారు. ఇంకా రాఖీ పండుగ (ఆగ‌స్టు 11న‌) రాకుండానే త‌న‌కు త‌న సోద‌రుడు అర్జున్ టెండూల్క‌ర్ అదిరిపోయే కానుకిచ్చాడ‌ని ముసిముసిగా న‌వ్వేస్తోంది సారా. ఇంత‌కీ ఏం గిఫ్టిచ్చాడు? అంటే పాపుల‌ర్ బ్రాండ్ హ్యాండ్ బ్యాగ్ ని కానుకిచ్చాడు. `కాప్రెస్ గ‌ర్ల్` బ్రాండ్ అల్ట్రా రిచ్ లెద‌ర్ బ్యాగ్ ఇది. తన సోద‌రుడు కానుకిచ్చిన‌ కాప్రెస్ గ‌ర్ల్ హ్యాండ్ బ్యాగ్ ని ఉప‌యోగించ‌కుండా ఆగ‌లేను! అంటూ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది.

అయినా సారా లాంటి అంద‌మైన అమ్మాయి అలా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్ తో వీధిలోకి వెళితే ఇంకేమైనా ఉందా? అస‌లు అది ఏ బ్రాండ్? అంటూ యూత్ అదే ప‌నిగా త‌ర‌చి చూస్తారు. ఇదే ఈ ప్రీగిఫ్ట్ వెన‌క తార‌క మంత్రం అని అంద‌రికీ తెలిసిపోయింది. ఎనీవే .. లేత రంగు ఫ్రాక్ ని ధ‌రించిన సారా టెండూల్క‌ర్ కి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ ని సెల‌క్ట్ చేసిన సోద‌రుడు అర్జున్ టెండూల్క‌ర్ ని ప్ర‌శంసించి తీరాలి. సారా మోడ‌లింగ్ నుంచి సినీరంగంలో ప్ర‌వేశించి బాలీవుడ్ లో మెరిసిపోవాల‌ని క‌ల‌లుగంటుంటే అర్జున్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడే టీమిండియా స‌భ్యుడు కావాల‌ని త‌హ‌త‌హలాడుతున్నాడు. అత‌డు ప్ర‌స్తుతం దేశ‌వాళీ క్రికెట్ లో రాణిస్తున్నాడు.

బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు?

సారా ప్ర‌స్తుతం టాప్ మోడ‌ల్ గా రాణిస్తోంది. సినీప్ర‌పంచంపై మ‌క్కువ పెంచుకుని స్టార్ గా వెల‌గాల‌నుకుంటోంద‌న్న గుస‌గుస వినిపిస్తోంది. సారా అందం .. న‌వ్వు.. చురుకుద‌నం ప్ర‌తిదీ యూత్ ని ఆక‌ర్షించడంలో ఎప్పుడూ విఫ‌లం కాలేదు. ఇక మోడ‌ల్ గా రాణించే క్ర‌మంలో న‌టిగా అవ‌కాశాలు వెతుక్కుంటూ రావ‌డం స‌హ‌జం. అయితే సారా కుటుంబం నుంచి ఆ ఒక్క ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. చూస్తుండ‌గానే వ‌న్ ఫైన్ డే బాలీవుడ్ లో న‌టిగా డెబ్యూ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేదన్న చ‌ర్చా నెటిజ‌నుల‌లో సాగుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్ కుటుంబంతో ఖాన్ ల ఫ్యామిలీస్ తో స‌త్సంబంధాలు కొన‌సాగించే స‌చిన్ కుటుంబం నుంచి సారా వార‌సురాలిగా వ‌స్తోంది కాబ‌ట్టి హిందీ చిత్ర‌ప‌రిశ్ర‌మ రెడ్ కార్పెట్ వేయ‌డానికి సిద్ధం. కానీ సారా ఎంపిక ఏది? అన్న‌దానిపై ఇంకా స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌టన రావాల్సి ఉంది.

సారా టెండూల్క‌ర్ ఇప్ప‌టికే వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల రంగంలో స్టార్ గా వెలుగుతోంది. ఫ్రేమ్ లో త‌ను క‌నిపిస్తే చాలు ఆ బ్రాండ్ వెలిగిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇంత‌కు ముందు ఓ ప్ర‌మోష‌నల్ యాడ్ షూట్ లో మ‌రో ఇద్ద‌రు మోడ‌ల్స్ తో క‌లిసి సారా క్యాట్ వాక్ చేసింది. ఓ పాపుల‌ర్ దుస్తుల కంపెనీ యాడ్ లో న‌టించింది. న‌టి బానిటా సంధు.. తానియా ష్రాప్ లతో క‌లిసి మోద‌టిసారి సారా కెమెరా ముందుకొచ్చింది. వెలుగులు విర‌జిమ్మింది. ఆ ప్ర‌క‌ట‌న‌లో సారా చాలా ప్రోఫెష‌న‌ల్ లుక్ తో క‌నిపిస్తుంది. అనుభ‌వం ఉన్న‌ మోడ‌ల్ లా మెప్పించింది. దానికి సంబంధించిన వీడియోని సారా త‌న ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేయ‌గా వైర‌ల్ అయ్యింది.

కొన్ని వారాల క్రితం మ‌రో వాణిజ్య ప్ర‌క‌ట‌నతో సారా మ‌తులు చెడ‌గొట్టింది. ప్ర‌ఖ్యాత బ్రాండెడ్ లిప్ స్టిక్ కంపెనీకి ప్ర‌మోష‌న్ చేస్తున్న వీడియో వైర‌ల్ గా మారింది. సారాతో పాటు కొంద‌రు మోడ‌ల్స్ ఈ ప్ర‌క‌ట‌న‌లో క‌నిపించగా అందరిలోనూ సారా టెండూల్క‌ర్ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. సారాకి ఇన్ స్టాలో అసాధార‌ణ ఫాలోయింగ్ ఉంది. 1.5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్స్ క‌లిగి ఉంది. సారా ఫ్యాష‌న్ ఎంపిక‌లైపై నెటిజ‌నులు ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌శంసిస్తూనే ఉన్నారు. నిరంత‌రం ఫిట్ నెస్ వీడియోలు... ఫోటోలతో ఈ బ్యూటీ ఆక‌ట్టుకుంటోంది. మోడ‌లింగ్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వ‌డంతో సారా బాలీవుడ్ ఎంట్రీకి స‌మ‌యం ఆస‌న్న‌మైన‌ట్లే క‌నిపిస్తోంద‌ని ఫ్యాన్స్ ప్ర‌తిసారీ విషెస్ తెలియ‌జేస్తున్నారు.