Begin typing your search above and press return to search.

స్పా లో అతని రాసలీలలు.. మాజీ భర్తపై సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 March 2022 2:30 PM GMT
స్పా లో అతని రాసలీలలు.. మాజీ భర్తపై సంచలన వ్యాఖ్యలు
X
సారా ఖాన్ మరియ అలీమర్చంట్‌ ల ప్రేమ వ్యవహారం గురించి బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సౌత్‌ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే వీరిద్దరు బిగ్‌ బాస్ వేదికపై పెళ్లి చేసుకున్నారు. బిగ్‌ బాస్ ప్రేక్షకులు వీరి పెళ్లికి సాక్షి. పెళ్లి నాటకీయ పరిణామాల మద్య జరిగింది. అంతే నాటకీయంగా వీరిద్దరు విడిపోయారు. కేవలం మూడు నెలల్లోనే వీరిద్దరు ఒకరిపై ఒకరు కోపంతో విడిపోవడంతో అప్పట్లో సంచలనంగా నిలిచింది.

ఎంతో ప్రేమించుకున్నాం అంటూ ఆ సమయంలో చెప్పిన వీరిద్దరు విడి పోవడంకు ప్రధాన కారణం ఏంటీ అనేది ఇన్నాళ్లుగా తెలియదు. ఎట్టకేలకు ఆ విషయమై సారా ఖాన్ క్లారిటీ ఇచ్చింది. బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ కంగనా రనౌత్‌ హోస్ట్‌ గా వ్యవహరిస్తున్న లాకప్ షో లో భాగంగా సారా ఖాన్ పాల్గొంది. ఆ సమయంలో తన మాజీ భర్తకు సంబంధించిన పలు షాకింగ్‌ విషయాలను వెళ్లడించి అందరికి షాక్ ఇచ్చింది.

అలీ మర్చంట్‌ కు ఉన్న అక్రమ సంబంధాల కారణంగానే తాను అతడి నుండి దూరం అయ్యాను అంటూ చెప్పుకొచ్చింది. అలీ కి లోఖండ్ వాలా లో ఒక స్పా ఉండేది. అక్కడ అమ్మాయిలతో అతడు వ్యవహరించే తీరును నేను పలు సందర్బాల్లో ప్రత్యక్షంగా చూశాను. దాంతో అతడికి మూడు వందల సార్లు చెప్పి చూశాను. వేరే అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం పై ఆయన్ను నిలదీశాను. కాని అతడు మాత్రం కనీసం పట్టించుకోలేదు.

అతడే వేరే అమ్మాయితో ఉన్నా కూడా నేను చాలా సార్లు పట్టించుకోలేదు. ఎందుకంటే నేను అతడిని చాలా ప్రేమించాను. అతడి వల్లే నా జీవితం సంతోషంగా ఉంటుందని నమ్మాను. కాని అందుకు అతను అర్హుడు కాదని ఆ తర్వాత నాకు అర్థం అయ్యింది. అందుకే అతడి నుండి విడి పోయాను. కొత్త జీవితంకు అడ్డంకి ఏమీ లేదని నాకు తెలుసు. అందుకే నేను జీవితంలో ముందుకు వెళ్లడం కోసం అతడి నుండి దూరం అయ్యాను అంది.

ప్రేమించిన వ్యక్తి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు అని తెలిసినప్పుడు అత్యంత బాధాకర విషయంగా అనిపిస్తుంది. అలాంటి బాధను నేను చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ సార్లు పడ్డాను అంటూ కన్నీరు పెట్టుకుంది. షో లో కంగనా రనౌత్‌ వద్ద ఇంకా పలు విషయాలను సారా ఖాన్ తెలియజేసింది. సారా ఖాన్ మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది హీరోయిన్స్ ఈమద్య కాలంలో లాకప్‌ షో లో తమ రహస్యాలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం లాకప్ కు మంచి రేటింగ్‌ దక్కుతోంది.