Begin typing your search above and press return to search.
54 కోట్లు రాబడితేనే సరైనోడు!!
By: Tupaki Desk | 21 April 2016 6:22 PM GMTస్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ సరైనోడు మరికొన్ని గంటల్లోనే థియేటర్లలోకి వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2వేల థియేటర్లలో సరైనోడు రిలీజ్ అవుతోంది. టైటిల్ తగ్గట్లుగా సరైనోడు అనిపించుకోవాలంటే.. బాక్సాఫీస్ దగ్గర బన్నీకి పెద్ద టార్గెట్టే ఉంది.
సరైనోడు ప్రి రిలీజ్ బిజినెస్ ని ఎక్కువగానే ఉంది. సీడెడ్ 8.1 కోట్లు, వైజాగ్ 4.9 కోట్లు, గుంటూరు, నెల్లూరు 6 కోట్ల బిజినెస్ చేశారు. ఇక సొంతంగా రిలీజ్ చేసుకుంటున్న ఏరియాల్లో మార్కెట్ వాల్యుయేషన్ ప్రకారం లెక్కించాల్సి ఉంటుంది. దీని ప్రకారం నైజాం ఏరియాకి 12 కోట్లు,.. ఈస్ట్-వెస్ట్-కృష్ణాల్లో 9 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే 40 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉండగా.. కర్నాటక 6 కోట్లు, తమిళనాడు 0.7 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 0.5 కోట్లు, ఓవర్సీస్ హక్కులను 6.2 కోట్లకు విక్రయించారు.
ఈ లెక్కన చూస్తే 53.4 కోట్లను కేవలం థియేటర్ల నుంచే సరైనోడు రాబట్టాలి. ఇక శాటిలైట్, ఆడియో వంటివి కలిపితే ఈ లెక్క 70 కోట్లు దాటుతుంది. అయితే.. బాక్సాఫీస్ దగ్గర సరైనోడు అనిపించుకోవడానికి 54 కోట్లు వసూలు చేయాలి. గత మూడు చిత్రాలను 50కోట్ల మార్క్ దాటించిన బన్నీకి ఇదేమంత పెద్ద విషయం కాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.