Begin typing your search above and press return to search.
విరాట పర్వం : నిజ జీవిత కథ..సరళ అన్న ఏమన్నారో తెలుసా ?
By: Tupaki Desk | 19 Jun 2022 4:30 AM GMTరవన్న చెడ్డవాడు మా దృష్టిలో కానీ సినిమాలో చూపించిన పద్ధతి బాగుంది అని అంటున్నారు విరాట పర్వం సినిమా కథకు మూ లం అయిన కామ్రెడ్ సరళ సోదరుడు మోహన్ రావు. వరంగల్ లో 90లలో జరిగిన కథతో తెరకెక్కిన ఈ పిరియాడికల్ ప్యాట్రన్-కు కవి, కథకుడు వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆయనకు రెండో చిత్రం. ఇక నిన్ననే విడుదలయిన ఈ చిత్రం మంచి టాక్ తో వెళ్తోంది. ముఖ్యంగా సున్నిత భావోద్వేగాలను దర్శకుడు చూపించిన విధానం ఎంతో బాగుందని పలువురు సినీ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు.
ఇక నిజ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకోవడంతో ఒకనాటి యాక్టివిస్టులు (మూమెంట్లో ఉన్నవారు), ఇంకా ఇప్పటి సానుభూతి పరులు అంతా సోషల్ మీడియాలో చర్చోపచర్చలు చేస్తున్నారు. అయితే సరళ అనే కామ్రెడ్ కథ ఆధారంగా రూపుదిద్దుకోవడంతో ఆనాటి పరిణామాలను ఒక్కసారిగా అవలోకిస్తున్నారు. విప్లవోద్యమం నడిచిన తీరు, అడవుల్లో అన్నల ప్రభావం, రెండు గ్రూపుల మధ్య జరిగే సంఘర్షణలు , ముఖ్యంగా ఈ సినిమాకు మూలాధారం అయిన రవన్న దళం (దళ కమాండర్ శంకరన్న) కు సంబంధించిన ఊసులు ఇంకా చాలా చర్చకు వస్తున్నాయి.
ఈ సినిమాకు ప్రేరణగా నిలిచిన సరళ కుటుంబం ఇప్పటికే సినిమాను చూసి స్పందించింది. సరళ సోదరుడు మోహన్ రావు సినిమాను రూపుదిద్దించిన పద్ధతి బాగుందని, సినిమాటిక్ ఆకర్షణలు ఉన్నా కన్విన్స్ చేసిన పద్ధతి బాగుందని చెప్పారు. ఈ సినిమాలో ఆ ఇద్దరు (రానా మరియు సాయి పల్లవి) లేకపోతే సినిమానే లేదని తేల్చేశారు. ఓ విధంగా ఇదొక ప్రయోగం అని కూడా ఆయన చెబుతూ, దర్శకుడి ప్రతిభను ఆయన ప్రశంసించారు.