Begin typing your search above and press return to search.

సారంగదరియాః కోమలికి హామీ ఇచ్చిన కమ్ముల.. వివాదంకు ఫుల్‌ స్టాప్‌

By:  Tupaki Desk   |   11 March 2021 4:00 AM GMT
సారంగదరియాః కోమలికి హామీ ఇచ్చిన కమ్ముల.. వివాదంకు ఫుల్‌ స్టాప్‌
X
'లవ్‌ స్టోరీ' సినిమా నుండి వచ్చిన సారంగదరియా సాంగ్ యూట్యూబ్‌ లో ట్రెండ్డింగ్ లో ఉంది. పెద్ద ఎత్తున వ్యూస్ తో ఈ పాట దూసుకు పోతుంది. సారంగదరియా పాటకు పదుల సంఖ్యలో కవర్ వీడియోలు చేస్తున్నారు. ఇంత ఫేమస్ అయిన సారంగదరియా పాట తనది అంటూ కోమలి మీడియా ముందుకు వచ్చి కన్నీరు పెట్టుకోవడం హాట్‌ టాపిక్‌ అయ్యింది. తాను సేకరించి పాడిన సారంగదరియా సాంగ్ ను నాకు క్రెడిట్ ఇవ్వకుండా తీసుకున్నారంటూ అన్ని మీడియా సంస్థల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. కోమలి ఈ విషయమై శేఖర్‌ కమ్ముల స్పందించాలంటూ డిమాండ్ చేసింది. ఎట్టకేలకు కమ్ముల స్పందించి వివాదానికి ఫుల్ స్టాప్‌ పెట్టే ప్రయత్నం చేశాడు.

ఆమె కోరుకున్నట్లుగానే సినిమా లో ఆమె టైటిల్‌ కార్డు వేయడంతో పాటు ఆడియో ఫంక్షన్ లో ఆమెతో పాడించేందుకు ఒప్పుకోవడంతో పాటు ఆమెకు కొంత మొత్తంను కూడా చెల్లించేందుకు సిద్దంగా ఉన్నట్లుగా ప్రకటించి మొత్తం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాడు. కమ్ముల ఈ వివాదంపై తన సోషల్‌ మీడియా పేజీలో సుదీర్ఘ వివరణ ఇచ్చాడు. దాని ప్రకారం... చాలా ఏళ్ల క్రితం రేలా రే రేలా కార్యక్రమం చూస్తున్న సమయంలో సారంగదరియా పాట విన్నాను. ఆ పాట అప్పటి నుండి నా మనసులో ఉండిపోయింది. నా ప్రతి సినిమా కథ రాసుకునే సమయంలో ఏదో ఒక పాత పాట ను అనుకుంటూ ఉంటాను. లవ్ స్టోరీ కథ రాసుకున్న సమయంలోనే ఈ పాట పెట్టాలనిపించింది. సుద్దాల అశోక్‌ తేజ గారి వద్దకు వెళ్లి ఆ విషయం చెప్పిన సమయంలో పల్లవి తీసుకుని చరణాలను రాశారు. పాట చాలా బాగా వచ్చింది. పాటను పాడించేందుకు శిరీష ను మా అసిస్టెంట్ డైరెక్టర్ కాంటాక్ట్‌ అయ్యాడు. ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ అవ్వడం వల్ల పాడలేను అని చెప్పారు.

పాట విడుదల చేయబోతున్నట్లుగా అనౌన్స్‌ మెంట్‌ చేసిన తర్వాత మళ్లీ ఇద్దరు కూడా పాడుతామని అంటున్నారు అని సుద్దాల అశోక్‌ తేజ గారు చెప్పారు. ఇద్దరిలో కోమలి మొదట పాటను సేకరించింది. కనుక ఆమెతో పాటను పాడించడం న్యాయం అంటూ సుద్దాల అన్నప్పుడు ఆమెను పిలిపించాలనుకున్నాం. వరంగల్ నుండి వెంటనే రావాలని పాట విడుదల తేదీని అనౌన్స్‌ చేశాం కనుక ఆలస్యం చేయవద్దని కోమలిని అడిగితే ఆమె జలుబుగా ఉంది పాడలేను క్రెడిట్ ఇస్తే చాలు అన్నారు. అందుకే మంగ్లీతో పాడించాము. కోమలి కి క్రెడిట్ ఇవ్వడంతో పాటు కొంత మొత్తం డబ్బు కూడా ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని శేఖర్ కమ్ముల ప్రకటించడంతో ఈ వివాదంకు తెర పడ్డట్లే అనిపిస్తుంది. దీనిపై కోమలి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.