Begin typing your search above and press return to search.
ఉసూరుమనిపించిన సారంగదరియా..!
By: Tupaki Desk | 25 Sep 2021 4:32 AM GMTనాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లవ్ స్టోరీ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత ఏడాది నుండి ఊరిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రివ్యూలు మాత్రం మిశ్రమంగా వస్తున్నాయి. మొత్తానికి శేఖర్ కమ్ముల మార్క్ కాకున్నా కూడా ఒక మంచి మెసేజ్ తో ప్రేక్షకులను ఆలోచింపజేసే విధంగా సినిమా ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా పై అంచనాలు విపరీతంగా పెరగడానికి కారణం పాటలు. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన సారంగదరియా సాంగ్ ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా స్పీడ్ గా వంద మిలియన్ లను.. రెండు వందల మిలియన్ లను మూడు వందల మిలియన్ లను క్రాస్ చేసిన సారంగదరియా సినిమా అంచనాలను జనాల్లో పీక్స్ కు తీసుకు వెళ్లింది. సినిమాలో ఈ పాట ఏ రేంజ్ లో ఉంటుందో అంటూ అంతా ఊహల్లో తేలిపోయారు.
సినిమా లో సారంగదరియా సాంగ్ ప్లేస్ మెంట్ విషయంలో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. సినిమా మంచి ఫీల్ తో సాగుతున్న సమయంలో లేదా ఎంటర్ టైన్మెంట్ తో సాగుతున్న సమయంలో పాట వచ్చి ఉంటే బాగుండేది. కాని సినిమా సీరియస్ మూడ్ లో స్లోగా ఉన్న సమయంలో సారంగదరియా పాట వస్తుంది. స్లో మూడ్ లో ఉన్న సమయంలో సారంగదరియా సాంగ్ రావడం వెంటనే మెంటల్ గా కనెక్ట్ అవ్వడం కష్టంగా ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లవ్ స్టోరీ లో సారంగదరియా సాంగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకునే విధంగా ఏమీ లేదని.. ఇలాంటి పాటల ప్లేస్ మెంట్ సరిగ్గా ఉన్నట్లయితేనే ఆకట్టుకుంటాయని.. సినిమా స్థాయిని పెంచుతాయని విశ్లేషకుల అభిప్రాయం.
నాగచైతన్య మరియు సాయి పల్లవిలు నటన పరంగా ది బెస్ట్ ఇచ్చారు అనడంలో సందేహం లేదు. సారంగదరియా సాంగ్ లో సాయి పల్లవి యొక్క డాన్స్ ప్రతిభను మరోసారి ప్రేక్షకులు చూశారు. టాలీవుడ్ లోనే కాకుండా సౌత్ హీరోయిన్స్ లో ఈ రేంజ్ గ్రేస్ స్పీడ్ ఉన్న డాన్సర్స్ ఎవరు లేరు అంటూ ఆమె అభిమానులు బలంగా చెబుతున్నారు. డాన్స్ కాన్సెప్ట్ ఉన్న సినిమా అవ్వడంతో సాయి పల్లవి డాన్స్ ప్రతిభ మరింతగా ప్రేక్షకులకు చేరువ అయ్యే అవకాశం దక్కింది. మౌనిక పాత్రలో సాయి పల్లవి జీవించేసింది. రేవంత్ గా చైతూ ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా ఇప్పటికే పలు సినిమాల్లో తన నటనతో ఆకట్టుకుంది కాని ఈ సినిమాలో మౌనిక పాత్ర చాలా స్పెషల్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. సారంగదరియా పాటతో సినిమా స్థాయి పెరుగుతుందని భావిస్తున్న సమయంలో అనూహ్యంగా పాట ప్లేస్ మెంట్ విషయంలో ప్రేక్షకులకు ఉసూరుమనిపించిందనే టాక్ వినిపిస్తుంది.