Begin typing your search above and press return to search.

శ‌ర‌ణ్య పెళ్లి చేసుకోబోతోంది!

By:  Tupaki Desk   |   14 July 2015 6:37 AM GMT
శ‌ర‌ణ్య పెళ్లి చేసుకోబోతోంది!
X
బాల‌న‌టిగా తెర‌కు ప‌రిచ‌య‌మైంది శ‌ర‌ణ్య మోహ‌న్‌. ఆ త‌ర్వాత క‌థానాయిక‌గా మారి తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాషల్లో బోలెడ‌న్ని సినిమాలు చేసింది. తెలుగులో `భీమిలి కబ‌డ్డీ జ‌ట్టు`, `విలేజ్‌లో వినాయ‌కుడు`, `హ్యాపీ హ్యాపీగా` చిత్రాల్లో క‌థానాయిక‌గా న‌టించి మంచి గుర్తింపును తెచ్చుకొంది. `క‌త్తి`లో క‌ళ్యాణ్‌రామ్‌కి చెల్లెలిగా కూడా న‌టించింది. ఇటీవ‌ల త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కే ప‌రిమిత‌మైన ఆమె త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతోంది. అర‌వింద్ కృష్ణ‌న్ అనే ఓ వైద్యుడిని ఆమె సెప్టెంబ‌రులో వివాహ‌మాడ‌బోతోంది. గ‌డిచిన ఆదివారం ఇద్ద‌రికీ నిశ్చితార్థం జ‌రిగింది.

ఆ వేడుక‌లో త‌న‌కు కాబోయే భ‌ర్త‌తో కలిసి దిగిన ఫొటోని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. కేర‌ళ‌కి చెందిన శ‌ర‌ణ్య అక్క‌డే స్థిర‌ప‌డాల‌ని నిర్ణ‌యించుకొంది. శ‌ర‌ణ్య‌కి అర‌వింద్ కృష్ణ‌న్ చిన్న‌నాటి స్నేహితుడట‌. ఆ అనుబంధంతోనే ఇద్ద‌రూ పెళ్లి చేసుకొంటున్నార‌ట‌. పెద్ద‌ల అంగీకారంతో జ‌రుగుతున్న ఈ పెళ్లి సెప్టెంబ‌రులో ఓ గుడిలో జ‌ర‌గ‌నున్న‌ట్టు తెలిసింది. శ‌ర‌ణ్య అచ్చ‌మైన తెలుగ‌మ్మాయిలా క‌నిపిస్తుంటుంది. అందుకే తొలి చిత్రంతోనే ఆమె తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. ఆ త‌ర్వాత చెప్పుకోద‌గ్గ విజ‌యాల్లేక‌పోవ‌డంతో ఆమె వెనుదిర‌గ‌క త‌ప్ప‌లేదు.