Begin typing your search above and press return to search.

శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్

By:  Tupaki Desk   |   8 Dec 2020 5:28 PM IST
శరత్‌కుమార్‌కు కరోనా పాజిటివ్
X
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు సైతం ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ కూడా కరోనా వ్యాధికి గురయ్యారు. ఈ విషయాన్ని ఆయన భార్య, సినీ నటి రాధిక ట్విట్టర్ ద్వారా తెలిపారు.

ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేరినట్టు ఆటు రాధికా శరత్‌కుమార్‌, అలాగే తనయ వరలక్ష్మి శరత్‌ కుమార్‌ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. కరోనా లక్షణాలు ఏమీ లేకుండానే పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న పొన్నియిన్ సెల్వన్‌ లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇకపోతే, ఒకప్పుడు రోజూ లక్ష కరోనా కేసులు వచ్చిన ఇండియాలో, నిన్న కొత్తగా 26,567 పాజిటివ్ కేసులు మాత్రమే వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 97,03,770కి చేరింది. నిన్న కొత్తగా 385 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 1,40,958కి చేరింది. దేశంలో కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంది. నిన్న ఇండియాలో 39,045 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 91,78,946కి చేరింది. రికవరీ రేటు దేశంలో 94.6 శాతంగా ఉంది. ప్రస్తుతం ఇండియాలో యాక్టివ్ కేసులు 3,83,866 ఉన్నాయి. నిన్న కొత్తగా 10,26,399 టెస్టులు జరగ్గా... మొత్తం టెస్టుల సంఖ్య 14,88,14,055కి చేరింది.