Begin typing your search above and press return to search.
నాలుగు ఏరియాల్లో నాన్-బాహుబలి రికార్డులు
By: Tupaki Desk | 16 April 2016 7:45 AM GMTఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేస్తుంది.. బయ్యర్లను ఏమాత్రం ఆదుకుంటుంది అన్నది పక్కనబెడితే.. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ తొలి వారంలో కొన్ని రికార్డుల్ని మాత్రం ఖాతాలో వేసుకుంది. ‘శ్రీమంతుడు’ పేరటి ఉన్న నాన్-బాహుబలి రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేస్తుందని అంచనా వేసిన ‘సర్దార్’.. ఓవరాల్ గా కాకున్నా.. తొలి వారం వసూళ్ల వరకు కొన్ని ఏరియాల్లో కొత్త రికార్డులు నెలకొల్పింది. ఆల్రెడీ తొలి రోజు రూ.30 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసి ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న ఫస్ట్ డే రికార్డును బద్దలు కొట్టిన సర్దార్.. తొలి వారం వసూళ్లలో కొన్ని ఏరియాల వరకు ‘శ్రీమంతుడు’ను దాటేసింది.
ఆంధ్రా.. రాయలసీమ.. ప్రాంతాల్లో తొలి వారం వసూళ్లలో నాన్-బాహుబలి రికార్డులు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సొంతమయ్యాయి. ఆంధ్రా మొత్తంలో తొలి వారం రూ.18.7 కోట్ల షేర్ కలెక్ట్ చేసి.. బాహుబలి తర్వాతి స్థానాన్ని ఆక్రమించింది ‘సర్దార్’. ఈ ఏరియాలో తొలి వారం గ్రాస్ వసూళ్లు రూ.26 కోట్ల పైనే వచ్చాయి. ఇక రాయలసీమ (సీడెడ్)లో సర్దార్ రూ.7.2 కోట్ల షేర్.. రూ.9.25 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇది కూడా నాన్-బాహుబలి రికార్డే. ఇంకా మెగా ఫ్యామిలీకి బాగా పట్టున్న రెండు ఆంధ్రా ఏరియాల్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కొత్త రికార్డులు నెలకొల్పింది. వైజాగ్ ఏరియాలో రూ.4 కోట్లు.. పశ్చిమగోదావరిలో రూ.3.55 కోట్లు వసూలు చేసి ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న కలెక్షన్ల రికార్డుల్ని బద్దలు కొట్టింది. తొలి వారంలో మొత్తంగా రూ.47 కోట్ల షేర్.. రూ.73 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఐతే ఇంకో రూ.40 కోట్ల షేర్ కలెక్ట చేస్తే కానీ.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కు రాదు. ఐతే మహా అయితే ఈ సినిమా రూ.10 కోట్లు వసూలు చేయొచ్చని.. రూ.30 కోట్ల దాకా నష్టాలు తప్పవని అంనా వేస్తున్నారు.