Begin typing your search above and press return to search.
సర్దార్ పంచ్ డైలాగులలో కూడా పెద్దపెద్ద పదాలు
By: Tupaki Desk | 4 April 2016 1:30 PM GMTసర్దార్ గబ్బర్ సింగ్ మరో నాలుగు రోజుల్లో మన ముందుకు రానున్న సందర్భంగా చిత్ర బృందం రోజుకో టీజర్ తో మనల్ని అలరిస్తున్నారు. నిన్న కౌంటర్, ఎన్ కౌంటర్ డైలాగ్ లో అరిపించిన పవన్ ఈరోజు సినిమాలో తన స్టామినా ఏమిటో ఒక వాయస్ ఓవర్ డైలాగ్ తో వినిపించాడు.
ఈ డైలాగ్ వినడానికి హీరో ఎలివేషన్ డైలాగ్ అయినా ఇతివృత్తం అర్ధంచేసుకోవడానికి సాధారణ ప్రేక్షకుడికి కాస్త సమయం పడుతుంది. "వీడు అందరిలాంటి మనిషికాదు.. ఈ జనం నుండి పుట్టిన ఐడియాలజీ" అనే డైలాగ్ ని రాసిన సాయి మాధవ్ బుర్రాని ముఖ్యంగా అభినందించాలి.
పంచ్ డైలాగ్ లు కేవలం ప్రాసలకే పరిమితం కాకుండా కాస్త డెప్త్ కి వెళ్ళి రాసిన తీరు అభినందనీయం. జనమందరూ ఇలానే వుండాలని కోరుకునేవాడే హీరో. అలా జనాల ఆలోచనలకు ప్రతిరూపమే సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ ఈ డైలాగ్ ఆదరగొట్టింది. లేటెస్ట్ టీజర్ లో దేవి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.