Begin typing your search above and press return to search.

పవన్ మిత్రుడు పెద్ద విలన్ అయిపోయాడుగా..

By:  Tupaki Desk   |   21 Feb 2017 4:55 AM GMT
పవన్ మిత్రుడు పెద్ద విలన్ అయిపోయాడుగా..
X
శరత్ మరార్.. తెలుగు సినిమాల్ని ఫాలో అయ్యేవాళ్లకు ఈ పేరు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్థానికుడు కాకపోయినా పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో తెలుగు ప్రేక్షకులతో ఈజీగా కనెక్టయిపోయాడు శరత్. పవన్ లాంటి సూపర్ స్టార్ తో వరుసగా మూడో సినిమా చేస్తున్న నిర్మాత అతను. మొన్నటి దాకా శరత్ ఇమేజ్ వేరుగా ఉండేది. కానీ నిన్నటితో అతడి ఇమేజ్ బాగా దెబ్బ తినేసింది. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా కొని దారుణంగా నష్టపోయిన కృష్ణా జిల్లా డిస్ట్రిబ్యూటర్ సంపత్ చేసిన ఆరోపణలతో శరత్ పెద్ద విలన్ అయిపోయాడు. ‘సర్దార్’తో నష్టాల పాలైన బయ్యర్లను ఆదుకోవడానికే ‘కాటమరాయుడు’ సినిమాను తెరమీదకు తెచ్చినట్లు చెప్పి.. చివరికి సినిమాను వేరే బయ్యర్లకు ఇచ్చేయడం నమ్మకద్రోహమే అని అంటున్నాడు సంపత్.

పవన్ వ్యక్తిత్వం మీద అవగాహన ఉన్నవాళ్లందరూ ఈ విషయంలో అతడి ప్రమేయం ఏమీ లేదని అనుకుంటున్నారు. నిజంగా అందులో ఎంత వాస్తవముందో ఏమో కానీ.. ప్రస్తుతానికైతే పూర్తి బ్లేమ్ శరత్ మరార్.. పవన్ ఆఫీస్ వ్యవహారాలు చూసే శ్రీనివాస్ ల మీదే పడుతోంది. ‘సర్దార్’కు.. ‘కాటమరాయుడు’కు నిర్మాత శరతే కాబట్టి ఈ వివాదానికి సంబంధించి శరతే మెయిన్ విలన్ అయ్యాడు. ఇప్పటిదాకా పవన్ కు ఫెసిలిటేటర్ లాగా కనిపించిన శరత్.. ఇప్పుడు ఆయన చుట్టూ కోటరీ కట్టేసి బయటి విషయాలు తెలియకుండా చేస్తున్నట్లు.. పవన్ ను వాడుకుని వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పవన్ కు సంబంధించిన సినీ విశేషాలన్నింటినీ అతడి తరఫున తనే వెల్లడించే శరత్.. సంపత్ ప్రెస్ మీట్ తర్వాత సైలెంటుగా ఉన్నాడు. ఇంకా కౌంటర్ ఇవ్వకపోవడం కొంత ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్న పవన్ చేనేత కార్మికుల మీటింగ్ హడావుడిలో ఉన్నాడు కాబట్టి తనతో ఇంకా మాట్లాడలేదేమో. బహుశా ఈపాటికి పవన్ కు కూడా విషయం చేరి ఉంటుంది పవన్ ఎలా స్పందిస్తాడో.. శరత్ ఎలాంటి వివరణ ఇస్తాడో చూడాలి. చూస్తుంటే ఈ వ్యవహారంలో తప్పంతా శరత్ అండ్ కో మీదే ఉన్నట్లు తెలుస్తోంది. మరి కౌంటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో? ఐతే పవన్ కు తెలియకుండా వీళ్లు ఎన్ని విషయాలు దాచినా.. ‘సర్దార్’ వల్ల బయ్యర్లు నష్టపోయారు కాబట్టి వాళ్లకు న్యాయం జరుగుతోందా లేదా అన్నది పవన్ కూడా పట్టించుకుని ఉండాలి. అదే జరిగి ఉంటే వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదేమో. మరి ఈ వివాదం చివరికి ఎలా కొలిక్కి వస్తుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/