Begin typing your search above and press return to search.
సర్దార్.. ఇండస్ట్రీకి పాఠాలు నేర్పాడా?
By: Tupaki Desk | 15 April 2016 10:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ కి వచ్చిన రిజల్ట్.. ఇండస్ట్రీని ఆలోచనలో పడేసింది. ఫెయిల్యూర్స్ సహజమే కానీ.. సర్దార్ లాంటి భారీ అంచనాలున్న సినిమా ఫెయిలైతే.. చాలామంది డిస్ట్రిబ్యూటర్లు దివాలా తీసేసే పరిస్థితి కూడా ఉంటుంది. మొదటి మూడ్రోజుల్లోనే 40కోట్లకు పైగా వసూలు చేసిన ఓ సినిమా... చివరకు ఫ్లాప్ గా నిలిచిందంటే అందుకు కారణం ఖచ్చితంగా స్టోరీ నేరేషన్ - స్క్రీన్ ప్లే.
సర్దార్ కి స్టోరీ - స్క్రీన్ ప్లే తనే అంటూ నేమ్ కార్డ్ వేసుకున్నాడు పవన్. పవర్ స్టార్ ఇలా ఓపెన్ గా తన పేరు వేసుకున్నాడు కానీ.. నిజానికి ఇలా స్టోరీ - డైరెక్షన్ లో వేలు పెట్టేసే హీరోలు చాలామందే ఉన్నారు. డైరెక్టర్ - రైటర్ పనుల్లో దూరిపోయి మార్పులు చేర్పులు చేసేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఘోస్ట్ డైరెక్షన్ చేసేసే హీరోలు కూడా మన టాలీవుడ్ లో ఉన్నారు.
డైరెక్టర్ ని తన పని తను చేసుకోనివ్వకుండా.. తమ ట్యాలెంట్ చూపించే హీరోలకు సర్దార్ గబ్బర్ సింగ్ ఓ గుణపాఠం అంటున్నారు కొందరు నిర్మాతలు. సర్దార్ ఫలితం చూశాకయినా.. దర్శకుడిని వాళ్ల పని వాళ్లనే చేసుకోనివ్వాలని గుర్తించాలని అంటున్నారు.