Begin typing your search above and press return to search.
ప్రీమియర్లు, డైలీ 5 షోలు.. సర్దార్ రచ్చ
By: Tupaki Desk | 4 April 2016 3:58 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఏప్రిల్ 8న విడుదలవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ల హంగామాతో వీకెండ్ వరకూ ఫుల్ అయిపోతున్నాయి. ఆన్ లైన్ లో థియేటర్స్ యాడ్ చేయడం ఆలస్యం.. గంటల్లోపే టికెట్స్ అన్నీ సేల్ అయిపోతున్నాయి. వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రీమియర్ల హంగామా మొదలైపోయింది.
ఇప్పటికే సర్దార్ గబ్బర్ సింగ్ స్పెషల్ స్క్రీనింగ్ - బెనిఫిట్ షోల కోసం డిమాండ్ విపరీతంగా ఉంది. సిటీస్ లో అయితే.. దాదాపు అన్ని థియేటర్లలోనూ ప్రీమియర్ షోలు వేసేందుకు డిమాండ్ ఉంది. ప్రధానంగా హైద్రాబాద్ లో ఇప్పటికే చాలా థియేటర్లు పర్మిషన్ కూడా తెచ్చేసుకున్నాడు. ప్రీమియర్ షోస్ పేరుతో ఒక్కో టికెట్ కు 2,500 నుంచి 3 వేల వరకూ టికెట్ రేట్లు నిర్ణయించినా, డిమాండ్ మాత్రం ఎక్కువగానే ఉంది. ఏప్రిల్ 7 అర్ధ రాత్రి నుంచే స్పెషల్ షోలు వేసేయనున్నారు.
ఇక డైలీ ఫైవ్ షోస్ ట్రెండ్ ని కూడా సర్దార్ స్టార్ట్ చేయనున్నాడు. మల్టీప్లెక్స్ లలో ఇది సాధారణమే కానీ... సింగిల్ స్క్రీన్ లలో కూడా ఇలా ఐదేసి షోస్ వేయనున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ఇందుకోసం ప్రత్యేకంగా పర్మిషన్స్ తెచ్చుకున్నారు థియేటర్ ఓనర్స్. మొదటి వారం రోజులు రోజుకు 5 ఆటలు చొప్పున సర్దార్ గబ్బర్ సింగ్ ను ప్రదర్శించనున్నారు. మిగిలిన జిల్లాలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.