Begin typing your search above and press return to search.

సర్దార్ కథ అలా ముగిసింది

By:  Tupaki Desk   |   22 May 2016 8:51 AM GMT
సర్దార్ కథ అలా ముగిసింది
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీకి ఫుల్ రన్ పూర్తయిపోయింది. రెండు రాష్ట్రాల్లోను మొత్తం అన్ని థియేటర్లలోంచి సినిమాను తీసేశారు. ఏప్రిల్ 8న రిలీజ్ అయిన సర్దార్ గబ్బర్ సింగ్.. ఏపీ - తెలంగాణల్లో తొలి రోజు రికార్డులు.. ఓవర్సీస్ లో ప్రీమియర్ కలెక్షన్ రికార్డులను తప్ప వేరే ఏ రికార్డుల జోలికి వెళ్లలేకపోయింది.

మొత్తంగా సర్దార్ గబ్బర్ సింగ్ కు ప్రపంచవ్యాప్తంగా 52.2 కోట్ల షేర్ వసూలు చేయగలిగింది. ఇందులో కోస్తా జిల్లాల నుంచి 20.82 కోట్లు - సీడెడ్ నుంచి 8.40 కోట్లు వచ్చాయి. నైజాంలో తెలుగు - హిందీ వెర్షన్లకు కలిపి 12.05 కోట్లు రాబట్టగలగడం విశేషం. యుఎస్ఏ లో 3.90 కోట్లు రాబట్టిన సర్దార్.. కర్నాటక 4.55 కోట్లు రెస్టాఫ్ ఇండియా 1.40 కోట్లు - ప్రపంచవ్యాప్తంగా మిగిలిన ఏరియాల నుంచి 1.08 కోట్లను వసూలు చేసింది.

52 కోట్లకు పైగా షేర్ ను రాబట్టినా సర్దార్ ను డిజాస్టర్ కిందే పరిగణించాలి. ఈ సినిమాను అమ్మిన రేట్లతో పోల్చితే ఇది చాలా తక్కువ కావడమే ఇందుకు కారణం. అయితే.. డిజాస్టర్ గా మిగిలి కూడా 50 కోట్ల మార్కును అధిగమించిన తొలి సినిమా సర్దార్. చాలామంది హీరోలకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా ఈ మార్క్ అందుకోలేకపోతున్నారు. ఇలా తొలిరోజే అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాతో 50 కోట్లను అందుకోవడం పవన్ కి తప్ప.. టాలీవుడ్ లో వేరే హీరోకి సాధ్యం కాదని చెప్పచ్చు.