Begin typing your search above and press return to search.
నైజాంలో పవన్ రచ్చ మామూలుగా లేదు
By: Tupaki Desk | 25 March 2016 4:41 AM GMTపాటొచ్చి పదేళ్లయింది.. పవర్ తగ్గలా అంటూ ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ఓ డైలాగ్ వేస్తాడు ఆలీ. పవన్ నిజ జీవితానికి అన్వయించే ఆ డైలాగ్ రాశాడు హరీష్ శంకర్. ఆ పదేళ్లలో పవన్ తన స్థాయికి తగ్గ హిట్టు ఒక్కటీ కొట్టలేకపోయాడు. దారుణమైన డిజాస్టర్లు చవిచూశాడు. అయినప్పటికీ ‘గబ్బర్ సింగ్’కు పాజిటివ్ టాక్ రాగానే బాక్సాఫీస్ బద్దలైపోయింది. ఆ తర్వాత ‘అత్తారింటికి దారేది’తోనూ మరోసారి తన పవర్ చూపించి.. రికార్డుల తుప్పు వదలగొట్టాడు పవన్. ఆ సినిమా వచ్చి రెండున్నరేళ్లు అయిపోతోంది. మధ్యలో పవన్ అతిథి పాత్ర పోషించిన ‘గోపాల గోపాల’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. అయినప్పటికీ పవన్ పవర్ ఏమాత్రం తగ్గలేదని రుజువు చేస్తోంది ‘సర్దార్ గబ్బర్ సింగ్’.
ఈ చిత్రానికి ఏకంగా రూ.100 కోట్లకు పైగా బిజినెస్ జరగడం విశేషం. దాదాపుగా ప్రతి ఏరియాలోనూ నాన్-బాహుబలి రికార్డుల్ని బద్దలు కొడుతూ సరికొత్త ప్రి రిలీజ్ బిజినెస్ రికార్డులు నెలకొల్పుతోంది ఈ సినిమా. నైజాం ఏరియా వరకే ఏకంగా రూ.20 కోట్లకు ‘సర్దార్..’ థియేట్రికల్ రైట్స్ అమ్ముడవడం విశేషం. ఇక్కడ బాహుబలి రూ.25 కోట్లతో రికార్డు నెలకొల్పింది. అప్పుడు ఆ సినిమాకు అది చాలా పెద్ద అమౌంట్ అనే అనుకున్నారు. కానీ ఆ చిత్రం దానికి రెట్టింపు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక గత ఏడాది మహేష్ బాబు సినిమాకు రూ.15 కోట్ల దాకా పెట్టింది అభిషేక్ పిక్చర్స్. ఆ సినిమా రూ.20 కోట్ల దాకా వసూలు చేసి చరిత్ర సృష్టించింది. ఐతే గత రికార్డును ఏకంగా రూ.5 కోట్ల అధిక మొత్తంతో బద్దలు కొట్టడం అన్నది ఆశ్చర్యకర పరిణామం. ఇంద్ర ఫిలిమ్స్ సంస్థ ఈ సాహసం చేసింది. ఐతే సినిమాకు హిట్ టాక్ రావాలే కానీ.. ఆ మొత్తం షేర్ రికవర్ చేయడం పెద్ద కష్టం కాదు. కానీ సినిమాకు నెగెటివ్ టాక్ వస్తేనే బయ్యర్ పరిస్థితి తేడా అవుతుందేమో.