Begin typing your search above and press return to search.

అతని కష్టాన్ని వివరించిన సర్దార్‌ డైరీ

By:  Tupaki Desk   |   28 March 2016 5:41 AM GMT
అతని కష్టాన్ని వివరించిన సర్దార్‌ డైరీ
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ లో... రత్నాపూర్ కి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ రత్నాపూర్ కే పోలీస్ ఆఫీసర్ గా పవన్ వస్తాడని ఇప్పటికే ట్రైలర్ లో చెప్పేశారు. ఛత్తీస్ ఘడ్ బోర్డర్ లో ఈ స్టోరీ నడిచినా.. నిజానికి ఈ రత్నాపూర్ సెట్ ని హైద్రాబాద్ లోనే వేసేశారు. ఇందుకోసం ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి పడిన కష్టాన్ని.. సర్దార్ గబ్బర్ సింగ్ డైరీస్ 4లో వివరించింది యూనిట్.

గతంలో గబ్బర్ సింగ్ కోసం సెట్ వేసిన ప్రాంతంలోనే ఈ రత్నాపూర్ సెట్ ని కూడా వేయడం విశేషం. అయితే... ఆ పోలిక ఏ మాత్రం కనిపించకుండా ఉండేలా చాలానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఓ పాతబంగ్లా పరిసరాలను ఎంపిక చేసుకుని దాని చుట్టూ ఈ సెట్ నిర్మాణం జరిగింది. ఈ ప్రాంతాన్ని చదును చేసేందుకు 350 ట్రక్కుల మట్టిని ఉపయోగించారు. దాదాపు 500 మంది పనివారు కష్టపడి 45 రోజుల్లోనే రత్నాపూర్ ని నిర్మించేయడం విశేషం.

పవన్ కళ్యాణ్ నుంచి స్టోరీ - స్క్రీన్ ప్లేకి సంబంధించిన ఇన్ పుట్స్ తీసుకున్న ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ కడలి... షూటింగ్ కి అవసరమైన అన్ని ప్రాంతాలను తనే సృష్టించేశాడు. ఓ రైల్వే ట్రాక్ - ఓవర్ హెడ్ ట్యాంక్ - మార్కెట్ - గోవిందం హెయిర్ సెలూన్ - ఢాబా - కిరాణా షాప్ - స్క్రాప్ షాప్ - పోస్ట్ ఆఫీస్ - లైబ్రరీ - కొన్ని ఇళ్లు.. ఇలా అనేక సెట్స్ ను అదే ప్రాంతంలో అందంగా నిర్మించేశాడు ఈ అపర బ్రహ్మ.

అక్కడ ఉన్న చెట్లకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా.. కనీసం ఒక కొమ్మను కూడా నరకకుండా.. ఎకో ఫ్రెండ్లీ కాన్సెప్ట్ తో ఈ సెట్ నిర్మాణం జరగడం విశేషం. ఈ విషయంలో ఒక్క మొక్కను కూడా ముట్టుకోవడానికి వీల్లేదని పవన్ నుంచి ముందే స్ట్రిక్ట్ ఇన్ స్ట్రక్షన్స్ వచ్చాయట. గబ్బర్ సింగ్ సెట్ ని కూడా ఇదే ప్రాంతంలో వేయడంతో.. ఆ మూవీ గుర్తుకు రాకుండా ఉండేలా వేసిన రత్నాపూర్ సెట్... సర్దార్ గబ్బర్ సింగ్ లో హైలైట్ గా నిలిస్తుందని అంటున్నారు.