Begin typing your search above and press return to search.
అక్కడ 200కు పైగా స్క్రీన్లలో సర్దార్ రచ్చ
By: Tupaki Desk | 6 April 2016 11:30 AM GMTఅక్కడ ఇక్కడ అని తేడాలో లేదు. అన్ని చోట్లా పవర్ స్టార్ ప్రభంజనమే అన్నట్లుంది పరిస్థితి. మామూలుగా మాస్ సినిమాల మీద ఓవర్సీస్ ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించరన్న అభిప్రాయం ఉంది. కానీ పవన్ విషయంలో మాత్రం దానికి మినహాయింపు ఇవ్వాల్సిందే. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా మీద ఓవర్సీస్ లో ఉన్న హైప్ అంతా ఇంతా కాదు. ఒక్క యుఎస్ టెరిటరీలోనే 200కు పైగా స్క్రీన్లలో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ హల్ చల్ చేయబోతోంది. ఒక్క ‘బాహుబలి’కి మాత్రమే ఇంతకంటే ఎక్కువ స్క్రీన్లు ఇచ్చారక్కడ. ఇక ప్రిమయర్ షోల విషయానికి వస్తే ‘బాహుబలి’ని కూడా వెనక్కి నెట్టేయబోతోంది సర్దార్.
300కు పైగా ప్రిమియర్ షోలు పడబోతున్నట్లు ‘సర్దార్ గబ్బర్ సింగ్’ను యుఎస్ లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఐడ్రీమ్స్ సంస్థ చెబుతోంది. రెండు రోజుల ముందే డ్రైవ్స్ అన్నీ డిస్పాచ్ అయిపోయాయని.. విడుదలకు ముందు రోజు భారత కాలమానం ప్రకారం 4 గంటలకే కొన్ని లొకేషన్లలో ఫస్ట్ ప్రిమియర్ షో పడే అవకాశముందని చెబుతోందా సంస్థ. ప్రిమియర్ షోల టికెట్ ధర కనీసం 35 డాలర్ల దాకా ఉంటోంది. అయినప్పటికీ అభిమానులు ఏమాత్రం తగ్గట్లేదు. ప్రిమియర్ షోల కోసం బుకింగ్స్ ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే 15 లొకేషన్లలో టికెట్లు అయిపోవడం విశేషం. యుఎస్ తో పాటు మొత్తం 43 దేశాల్లో ‘సర్దార్ గబ్బర్ సింగ్’ విడుదలవుతోంది. బాహుబలి కూడా ఇన్ని దేశాల్లో రిలీజవ్వలేదు. ఇది టాలీవుడ్ రికార్డు. ఈ 43లో 23 దేశాల్లో తెలుగు సినిమా రిలీజవ్వడం తొలిసారి కావడం విశేషం.