Begin typing your search above and press return to search.

అమెరికాలో పవన్ అరుదైన రికార్డ్

By:  Tupaki Desk   |   19 April 2016 7:54 AM GMT
అమెరికాలో పవన్ అరుదైన రికార్డ్
X
భారీ సినిమాలు విడుదలయినప్పుడల్లా కొత్త కొత్త రికార్డులు సృష్టించాలని మేకర్స్ - యాక్టర్స్ తో పాటు ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు. పది రోజుల క్రితం విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్.. ప్రీమియర్స్ లో ఇలాంటి రికార్డునే సృష్టించింది. ఆ తర్వాత మాత్రం బాగా డల్ అయిపోయిన ఈ చిత్రం... సెకండ్ వీకెండ్ లో మాత్రం ఓ వినూత్న రికార్డును సృష్టించింది.

యూఎస్ ఏలో రెండో వారాంతంలో 55 స్క్రీన్లలో సర్దార్ గబ్బర్ సింగ్ ను ప్రదర్శించారు. తెలుగు సినిమాల వరకూ చూసుకుంటే ఈ స్క్రీన్ల సంఖ్య ఎక్కువ అనే చెప్పాలి. అయితే.. ఇన్ని స్క్రీన్ ల ద్వారా వీకెండ్ 3 రోజుల్లో సర్దార్ వసూలు చేసిన మొత్తం ఎంతో తెలుసా..? కేవలం 20,807 డాలర్లు మాత్రమే. అంటే సగటున ఒక్కో స్క్రీన్ కు 400 డాలర్లు మాత్రమే వచ్చాయన్న మాట. ఒక భారీ చిత్రానికి ఇది చాలా చిన్న మొత్తంగా చెప్పాలి. ఒక రకంగా ఇది కూడా రికార్డే. ఈ 20వేల డాలర్లతో కలిపి.. ఇప్పటివరకూ యూఎస్ లో 10,58,000 డాలర్లు. అదే మన రూపాయల్లో అయితే 7 కోట్లు.

సర్దార్ ను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్ కు కనీసం 4.5 కోట్ల నష్టం తప్పదని అంచనా వేస్తున్నారు. మరోవైపు నాగ్ కార్తీలు నటించిన ఊపిరి నాలుగో వారాంతంలో 23 స్క్రీన్ల నుంచి 14,593 డాలర్లను రాబట్టగా.. మంచు, విష్ణు-రాజ్ తరుణ్ ల ఈడో రకం ఆడో రకం తొలి వీకెండ్ లోో 13,634డాలర్లు(9.08లక్షల రూపాయలు)తో నిరుత్సాహపరిచింది.