Begin typing your search above and press return to search.
వామ్మో... సర్దార్ శాటిలైట్ రైట్స్ అంతా?
By: Tupaki Desk | 24 March 2016 11:30 AM GMTతెలుగు సినిమాల రేంజి రోజు రోజుకూ పెరిగిపోతోంది. బడ్జెట్.. రెమ్యూనరేషన్లు.. ప్రి రిలీజ్ బిజినెస్.. వసూళ్లు.. శాటిలైట్ రైట్స్.. ఇలా ప్రతి విషయంలోనూ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదైపోతున్నాయి. రాబోయే రెండు నెలల వ్యవధిలో రాబోతున్న సర్దార్ గబ్బర్ సింగ్.. సరైనోడు.. బ్రహ్మోత్సవం చిత్రాలు మూడు.. ఇప్పటికీ దేని ప్రత్యేకతను అది చాటుకుంటున్నాయి. ఈ మూడు సినిమాలూ ప్రి రిలీజ్ విషయంలో రికార్డుల మోత మోగిస్తున్నాయి. మహేష్ సినిమా ఓవర్సీస్ లో రికార్డు నెలకొల్పితే.. బన్నీ మూవీ రాయలసీమలో కొత్త రికార్డు సాధించింది. ఇక సర్దార్.. అయితే చాలా ఏరియాల్లో రికార్డులు బద్దలు కొట్టింది. ఇవన్నీ నాన్-బాహుబలి రికార్డులేలెండి. అది స్పెషల్ మూవీ కాబట్టి దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన పని లేదు.
ఇక శాటిలైట్ రైట్స్, వసూళ్ల రికార్డులే తేలాల్సి ఉంది. ఈ మూడు చిత్రాల్లో ముందుగా రాబోతున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీకే ముందుగా శాటిలైట్ హక్కులు అమ్ముడయ్యాయి. ఓ ప్రముఖ ఛానెల్ ఏకంగా రూ.13 కోట్లు పెట్టి ‘సర్దార్..’ శాటిలైట్ రైట్స్ పట్టేసినట్లు సమాచారం. ఇది టాలీవుడ్ రికార్డే. ‘బాహుబలి’ విషయంలో రెండు భాగాలకు కలిపి డీల్ సెట్ చేసినట్లు వార్తలొచ్చాయి. ఆ మొత్తం ఎంతన్నది కూడా వెల్లడి కాలేదు. సోలోగా చూసుకుంటే.. ‘సర్దార్..’దే రికార్డు. బ్రహ్మోత్సవం దీన్ని దాటుతుందేమో చూడాలి. ‘సరైనోడు’ హక్కులు కుూడా పది కోట్లకు తక్కువ కాకుండా పలికే అవకాశాలున్నాయి. శాటిలైట్, హిందీ థియేట్రికల్ రైట్స్ తో కలిపి చూసుకుంటే ‘సర్దార్’ లెక్క ఇప్పటికే రూ.100 కోట్లను దాటేసినట్లు తెలుస్తోంది.