Begin typing your search above and press return to search.
పవన్ తో మహేష్ పోటీ ఎలాగంటే..?
By: Tupaki Desk | 16 Feb 2016 5:07 AM GMTమాస్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న కథానాయకులు పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు. ఎవరి సినిమా విడుదలైనా అటు బాక్సాఫీసు, ఇటు ఇండస్ట్రీ కళకళలాడిపోవల్సిందే. అలాంటి ఇద్దరు స్టార్లకు చెందిన సినిమాలు సమ్మర్ ని టార్గెట్ చేసుకొనే సెట్స్ పైకి వెళ్లాయి. మొదట్లో ఇరు సినిమాల నిర్మాతలు చేసిన ప్రకటనల్నిబట్టి రెండూ కూడా ఒకేసారి ప్రేక్షకుల ముందుకొస్తాయేమో అనిపించింది.
పవన్ సర్దార్ గబ్బర్ సింగ్ నీ - మహేష్ బ్రహ్మోత్సవం నీ ఏప్రిల్ మాసంలోనే విడుదల చేయాలనుకొన్నారు నిర్మాతలు. ఏప్రిల్ అనేసరికి కొంపదీసి రెండు సినిమాలూ ఒకే రోజు విడుదలవుతాయా ఏంటి? అని మాట్లాడుకొన్నారు అభిమానులు. అయితే ఇప్పుడు మహేష్ సినిమా రిలీజ్ వాయిదా పడిందని, ఆ సినిమా ఏప్రిల్ నుంచి మేకి వెళ్లిందని ఫిల్మ్‌నగర్ జనాలు చెప్పుకొంటున్నారు. సర్దార్ విడుదలలో మాత్రం ఎలాంటి మార్పులూ లేవు. అనుకొన్నట్టుగా ఏప్రిల్ 8న విడుదల చేస్తున్నారట. అయితే ఇంతలో మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పవన్ సినిమా రిలీజ్ రోజే, మహేష్ కూడా రిలీజ్ చేస్తాడన్నదే ఆ వార్త. మహేష్ రిలీజ్ చేస్తున్నదేంటో కాదు... ఆడియోని. అవును.. బ్రహ్మోత్సవం ఆడియోని ఏప్రిల్ 8నే విడుదల చేయాలని ఇటీవల చిత్రబృందం డేట్ ని ఫిక్స్ చేసినట్టు తెలిసింది. బ్రహ్మోత్సవం అని పేరు పెట్టారు కాబట్టి తిరుపతిలో వెంకటేశ్వరస్వామి సన్నిధిలోనే ఆడియో వేడుకని జరపాలని యూనిట్ నిర్ణయించినట్టు సమాచారం. సినిమాలతో మహేష్ - పవన్ లు పోటీ పడతారేమో అనుకొంటే ఈ రకంగా పోటీ పడుతున్నారన్నమాట.