Begin typing your search above and press return to search.
‘సర్దార్’ ఆడియో రిలీజైపోయింది
By: Tupaki Desk | 30 March 2016 9:19 AM GMT‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఆడియో రిలీజై దాదాపు పది రోజులవుతుంటే.. కొత్తగా ఈ మాట ఏంటంటారా...? ఇది హిందీ ఆడియోకు సంబంధించిన కబురులెండి. ‘సర్దార్..’ను హిందీలోనూ రిలీజ్ చేయాలన్న నిర్ణయం కొంచెం లేటుగా తీసుకోవడంతో దీని ఆడియో ఆలస్యంగా విడుదలైందన్నమాట. దేవిశ్రీ ప్రసద్ కేవలం ఐదే ఐదు రోజుల్లో ఈ ఆడియో రెడీ చేయడం విశేషం. వారం రోజులుగా ముంబయిలోనే మకాం వేసి.. తెలుగు ట్యూన్స్ కు తగ్గట్లుగా లిరిక్స్ రాయించుకుని.. దాదాపుగా తెలుగు వెర్షన్ కు పాడిన గాయకులతోనే పాటలు పాడించకా.. ఒకట్రెండు రోజుల్లో ఆడియో రెడీ చేసి మార్కెట్లోకి తెచ్చేసింది ఈరోస్ సంస్థ. ఈ రోజు ఉదయం 11 గంటలకు ‘సర్దార్..’ ఆడియో డైరెక్టుగా మార్కెట్లోకి వచ్చేసింది. తమ అఫీషియల్ వెబ్ సైట్లో ఈ పాటలు నేరుగా వినే అవకాశం కల్పించింది ఈరోస్ సంస్థ.
తెలుగు ఆడియోలోని రెండు పాటలకు మాత్రమే సింగర్స్ మారారు. టైటిల్ సాంగ్ ను హిందీలోనూ బెన్నీ తయాలే పాడాడు. ఓ పిల్లా సుభానల్లా పాటను విజయ్ ప్రకాష్-శ్రేయా ఘోషల్.. తౌబా తౌబా పాటను మానసి-నకాష్ అజిజ్.. వీడెవడన్నా పాటను కార్తికేయన్.. హిందీలోనూ పాడారు. ఐతే నీ చేపకళ్లు పాటను మాత్రం హిందీలో తన తమ్ముడు సాగర్ తో పాడించే సాహసం చేయలేదు దేవి. లేడీ సింగర్ చిన్మయికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు. అక్కడ రవిచౌదరి-శ్వేత పండిల్ ఈ పాటను ఆలపించారు. ఇక ఐటెం సాంగ్ ఖాకీ చొక్కా పాటను తెలుగులో సింహా పాడితే.. హిందీలో మాత్రం దేవినే ఆ పని పూర్తి చేశాడు. తెలుగులో పాడిన మమతా శర్మనే హిందీలోనూ ఈ పాటకు వాయిస్ ఇచ్చింది.