Begin typing your search above and press return to search.

సర్దార్ లెక్క సెంచరీ దాటేసిందిగా

By:  Tupaki Desk   |   17 Feb 2016 5:30 PM GMT
సర్దార్ లెక్క సెంచరీ దాటేసిందిగా
X
పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సంచలనాలు స్టార్ట్ అయిపోయాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు వింటుంటేనే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. సాధారణంగా ఏ స్టార్ హీరోకి అయినా.. గత సినిమాతో పోల్చితే ఓ పదిశాతం అటూఇటూగా లెక్కలు తేలతాయి. కానీ పవర్ స్టార్ లెక్క మాత్రం అసలు అంచనాలకు అందడం లేదు. ఇప్పటివరకూ తేలిన కౌంట్ ప్రకారం సర్దార్ బిజినెస్ 105 కోట్లకు చేరుకుంది.

నైజాం 21 కోట్లు - సీడెడ్ 10.5 కోట్లు - ఆంధ్రా 30కోట్లు - ఓవర్సీస్ 10.5 కోట్లు - కర్నాటక 8 కోట్లు - రెస్టాఫ్ ఇండియా 3 కోట్లు - హిందీ డబ్బింగ్ రైట్స్ 6 కోట్లు - ఆడియో కోటిన్నర - శాటిలైట్ హక్కులు 13-14 కోట్లు.. మొత్తం సర్దార్ బిజినెస్ 100 కోట్లు దాటిపోయిందనే విషయం కన్ఫాం అయిపోయింది. పవర్ స్టార్ క్రేజ్ ముందు ఈ అంకెలు చిన్నవే కానీ.. ఇంత బిజినెస్ సరే మరి రికవరీ మాటేంటి అనే క్వశ్చన్స్ వినిపిస్తున్నాయి. ఇంతమొత్తం రికవరీ కావాలంటే.. సర్దార్ కలెక్షన్స్ ఇండస్ట్రీ టాప్2 హిట్స్ కి చేరాల్సిందే అన్నమాట.

ఇక్కడ పవన్ కెపాసిటీ లెక్కపెట్టాలంటే.. అత్తారింటికి దారేది లైఫ్ టైం కలెక్షన్స్ లెక్క లోకి తీసుకోవాలి. అది 82 కోట్లకు (షేర్‌) అటూ ఇటూగా ఉంటుంది. మరి ఈ మొత్తం కంటే ఎక్కువ కలెక్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు సర్దార్ పై ఉంది. ఇంత మొత్తం కావాలంటే విపరీతమైన హైప్‌.. సూపర్‌ స్టార్‌ క్యాస్ట్‌ ఉంటే కాని కుదరదు.. సర్దార్‌ లో కాజల్‌ అగర్వాల్‌ తప్ప అందరూ రొటీన్‌ చిన్న సైజు స్టార్లే.

ఏదేమైనా ఇప్పుడు పవన్ టార్గెట్ మాత్రం ఇండస్ట్రీ టాప్ 2 హిట్ కొట్టడమే అని ఫిక్స్ అవచ్చు. లేకపోతే పంపిణీదారులు బెంబేలెత్తేస్తారు.