Begin typing your search above and press return to search.

పవన్, మహేష్.. ఎవరు కింగో తేలిపోతుంది

By:  Tupaki Desk   |   5 Jan 2016 8:50 AM GMT
పవన్, మహేష్.. ఎవరు కింగో తేలిపోతుంది
X
తెలుగు పరిశ్రమలో చిరంజీవి నిష్క్రమణ తర్వాత ఎవరు నెంబర్ వన్ అన్న ప్రశ్న వచ్చినపుడల్లా.. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబుల చుట్టూనే చర్చ నడుస్తుంది. ఇద్దరూ ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ దగ్గర తమ స్టామినా చూపిస్తూనే ఉంటారు. ఒకప్పుడు పోకిరి - దూకుడు సినిమాలతో తనేంటో చూపించాడు మహేష్ బాబు. ఆ తర్వాత ‘గబ్బర్ సింగ్’తో పవన్ తన స్టామినా చూపించి.. ‘అత్తారింటికి దారేది’తో ఇండస్ట్రీ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మధ్య మహేష్ మళ్లీ జోరందుకుని.. ‘శ్రీమంతుడు’తో నాన్-బాహుబలి రికార్డులన్నీ కొట్టేసి తనే బిగ్గెస్ట్ స్టార్ అని చాటుకున్నాడు. ఇప్పుడిక మహేష్ రికార్డుల్ని పవన్ అధిగమిస్తాడని అతడి అభిమానులు చూస్తున్నారు.

ఐతే రాబోయే ఏప్రిల్ నెలలో టాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్స్ మధ్య ఆసక్తికర సమరం జరగబోతోంది. పవన్ కళ్యాణ్ - మహేష్ బాబు మూడు వారాల వ్యవధిలో బాక్సాఫీస్ దాడికి దిగుతున్నారు. ముందుగా ఏప్రిల్ 8న పవన్ కళ్యాణ్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ రాబోతోంది. ఆ సినిమా అంచనాలకు తగ్గట్లు ఆడితే ‘శ్రీమంతుడు’ రికార్డుల్ని తుడిచి పెట్టేయడం ఖాయం. ఒకవేళ అదే జరిగితే మహేష్ కు కొత్త టార్గెట్ ఫిక్సవుతుంది. నెలాఖరులో ఏప్రిల్ 29న ‘బ్రహ్మోత్సవం’తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు మహేష్. ఒకవేళ పవన్ సరికొత్త రికార్డులు నెలకొల్పితే.. దాన్ని మహేష్ సినిమా అధిగమిస్తుందా అన్నది ఆసక్తికరం. మొత్తానికి ఈ రెండు సినిమాలూ హిట్టయితే టాలీవుడ్ లో నెంబర్ వన్ ఎవరు అన్న ప్రశ్నకు కూడా సమాధానం దొరికేస్తుందేమో.