Begin typing your search above and press return to search.
సంక్రాంతికే సర్ధార్ సలసల!!
By: Tupaki Desk | 12 Aug 2015 11:19 PM GMTపవన్ కల్యాణ్ గేరు మార్చాడు. స్పీడ్ పెంచాడు. సర్ధార్ గా వస్తున్నాడు. బాబి అలియాస్ కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో సర్ధార్ జెట్ స్పీడ్ తో తెరకెక్కుతోంది. పవన్ ఇంతకాలం నత్తనడకన షూటింగుల్లో పాల్గొంటున్నాడని విమర్శలొచ్చిన ఇప్పుడు సీను మొత్తం యూటర్న్ తీసుకుందని సమాచారం. పవన్ మునుపెన్నడూ లేనంత స్పీడ్ గా ఉన్నాడు. రెగ్యులర్ గా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. బ్రేకులనేవే లేవు.. అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అసలు బాస్ ఇదే రేంజు లో రెచ్చిపోతే వచ్చే సంక్రాంతి పండక్కి సలసల మెరిసిన మెరుపులా బరిలోకి దిగిపోయినా దిగోపోవచ్చని అనిపిస్తోంది. అయితే ఇది ఇప్పటికే సంక్రాంతి రేసులో కన్ఫమ్ అయిన మరో రెండు పెద్ద సినిమాలకు కాస్త ఇబ్బంది పెట్టే న్యూసే. ఇప్పటికే మహేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'బ్రహ్మూెత్సవం', ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాన్నకు ప్రేమతో' బరిలోకి రెడీ అవుతున్నాయి. సరిగ్గా ఈ టైమ్ లో సర్ధార్ ట్రాకు మార్చి లైన్ లోకి వస్తే మరి ధియేటర్ల సమస్య తలెత్తకుండా ఉంటుందా?
తానులో రెండు ముక్కల్ని ఇద్దరికే కేటాయించాలనుకుంటే మూడోవాడు వాటా అడిగితే ఎలా? అందునా సర్ధార్ అంతటివాడే రంగంలోకి దిగిపోతుంటే ముచ్చెమటలు పట్టేయవూ? అదే జరుగుతోందిప్పుడు. కాకపోతే వారం వారం గ్యాపులో ఈ పెద్ద సినిమాన్నీ రిలీజ్ చేసుకోవచ్చు కాని, అప్పుడు 50 కోట్ల షేర్ అనేది కల గానే మిగిలిపోతుంది. ఏం జరుగుతుందో వెయిట్ అండ్ సీ.