Begin typing your search above and press return to search.
వీడియో : దేశ చరిత్రలో చీకటి రోజు మరోమారు ఆవిష్కరించనున్న 'సర్దార్ ఉద్దమ్'
By: Tupaki Desk | 28 Sep 2021 1:55 PM GMTబాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ మరో సారి భారతీయులు అంతా తనవైపు తిరిగి చూసే సినిమాను చేశాడు. గతంలో యూరి అనే సినిమాను చేసి ప్రతి ఒక్కరిలో దేశ భక్తిని రగిలించిన విక్కీ కౌశల్ మరోసారి దేశ భక్తి కాన్సెప్ట్ తో సినిమాను చేశాడు. సర్దార్ ఉద్దమ్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమాకు సూజిత్ సిర్కార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా లో విప్లవకారుడైన ఉద్దమ్ సింగ్ జీవితాన్ని ఆవిష్కరించబోతున్నారు. టైటిల్ రోల్‌ల ఓ విక్కీ కౌశల్ నటించాడు. ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ ద్వారా విడుదల చేయబోతున్నారు. అక్టోబర్ 16 నుండి ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో వారు స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అయ్యారు. సినిమా ప్రమోషన్ లో భాగంగా ప్రోమోను విడుదల చేశారు. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా విడుదల అయిన టీజర్ తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. ఒక దేశ భక్తుడు తన దేశంలో జరిగిన మారణకాంఢ కు ప్రతీకారం తీర్చుకుని ఉరి శిక్షను అనుభవించాడు. ఆ కథను డ్రమటిక్ గా దర్శకుడు రూపొందించాడు. ఈ సినిమా కోసం బాలీవుడ్ ప్రముఖులు మరియు ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమా కథ దేశ చరిత్రలో ఎప్పటికి మర్చిపోలేని ఒక చీకటి రోజును మరో మారు గుర్తుకు తీసుకు రాబోతుంది. మరో వంద ఏళ్లు అయినా కూడా ఇండియాలో బ్రిటిషర్స్ చేసిన జలియన్ వాలా బాగ్ దారుణంను మర్చిపోవడం కష్టం. అలాంటి జలియన్ వాలా బాగ్ నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పడు విక్కీ కౌశల్ హీరోగా సినిమా రావడంతో ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఆసక్తి చూపిస్తున్నారు.
1919 లో జరిగిన జలియన్ వాలా బాగ్ కు బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ కారణం.. ఆయన తన సైన్యంతో శాంతియుతంగా మీటింగ్ నిర్వహించుకుంటున్న స్వాతంత్ర్య సమరయోధుల పై తూటాల వర్షం కురిపించాడు. ఆ ఘటనలో వెయ్యి మందికి పైగా మృతి చెందారు. ఆ సంఘటనతో బ్రిటిషర్స్ పై మరింతగా వ్యతిరేకత పెరిగింది. వేలాది మంది మృతికి కారణం అయిన జనరల్ డయ్యర్ ను ఉద్దమ్ సింగ్ కాల్చి చంపాడు. దేశం మొత్తం గర్వించే పని చేసిన ఉద్దమ్ సింగ్ ఉరికంబం ఎక్కాడు. అయినా కూడా ఆయన చరిత్రలో నిలిచిపోయాడు. ఆయన స్ఫూర్తితో ఎంతో మంది స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు. ఆయన జీవితాన్ని ఆవిష్కరించి మళ్లీ ఆయన యొక్క గొప్పతనంను ఇండియన్స్ కు చెప్పేందుకు విక్కీ కౌశల్ వచ్చాడు. టీజర్ లో విక్కీ కౌశల్ లుక్ తో పాటు సినిమా నేపథ్యంను చెప్పే ప్రయత్నం చేశారు. సినిమా అద్బుతమైన దేశ భక్తి చిత్రాల జాబితాలో నిలిచి పోతుందనే నమ్మకంను విక్కీ కౌశల్ అభిమానులతో పాటు అంతా కూడా చెబుతున్నారు.