Begin typing your search above and press return to search.
రెండు వేల సంపాదన కూడా లేదని వాపోయిన సారిక
By: Tupaki Desk | 12 May 2022 4:46 AM GMTతనకు తగినంతగా మంచి ఆఫర్లు రాకపోవడంతో కొన్నాళ్లుగా సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని కమల్ హాసన్ మాజీ భార్య సారిక చెప్పారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా తన ఆదాయం లేని కాలం మరింత పొడిగించబడుతుందని ఊహించలేదని అన్నారు. ఆమె తన వద్ద ఉన్న డబ్బు అయిపోయినందున తిరిగి థియేటర్ రంగంలోకి రావాలని నిర్ణయం తీసుకున్నారట. కానీ ఇక్కడ 2వేలు సంపాదించడమే చాలా కష్టమని ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. దీనివల్ల వేరే ఉద్యోగాలు చేసానని తెలిపారు.
ప్రముఖ జాతీయ మీడియాతో ఇంటర్వ్యూలో సారిక మాట్లాడుతూ.. తాను ఐదు సంవత్సరాలు థియేటర్ రంగంలో అద్భుతంగా గడిపానని అయితే థియేటర్ మాత్రమే తనని నటిగా నిలబెట్టలేనందున ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగాలకు తిరిగి వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.
తాను నాటకాలు చేస్తూ రూ. 2000 కంటే తక్కువ సంపాదించానని అది పోషణకు అస్సలు సరిపోదని చెప్పారు. నాకు తెలియదు.. నేను జీవితాన్ని ఒక విధంగా వృధా చేసుకుంటున్నానని అనుకున్నాను. మీరు ప్రతి ఉదయం మేల్కొంటారు.. కానీ ఏదీ జరగదు.. మీరు నిద్రపోతారు. కాబట్టి నేను ఒక సంవత్సరం విరామం తీసుకోవాలని ఏ పని చేయకూడదని నిర్ణయించుకున్నాను. దూరంగా వెళ్లి పూర్తిగా భిన్నమైన పని చేస్తాను.. అని కూడా అన్నారు.
సారిక ఇంకా ఏమన్నారంటే.. ''లాక్ డౌన్ వల్ల నా డబ్బు అంతా అయిపోయింది. కాబట్టి ఎక్కడికి వెళ్లాలి? అంటే.. తిరిగి నటనలోకి వెళ్లాలి. ఎందుకంటే థియేటర్ లో నాకు కేవలం రూ. 2000-2700 మాత్రమే ఇస్తారు.
దాంతో ఇంక ఏమీ చేయలేం. అందుకే నేను అక్కడ లేను. ఇది చాలా స్పృహతో తీసుకున్న నిర్ణయం.. అయితే ఇది ఒక సంవత్సర కాలం మాత్రమేనని నేను అనుకున్నాను. కానీ అది ఐదేళ్లు అయిపోయింది. అవి గొప్ప ఐదు సంవత్సరాలు.. మర్చిపోలేనివి'' అని అన్నారు.
ఆసక్తికరంగా సినిమాకి 2కోట్లు పారితోషికం అందుకునే శ్రుతిహాసన్ సైతం లాక్ డౌన్ సమయంలో తాను ఇష్టపడి కొనుక్కున్న కొత్త ఇల్లు ఈఎంఐ కట్టలేకపోయానని వాపోవడం తెలిసినదే. అంత పెద్ద సెలబ్రిటీలే లాక్ డౌన్ ని కరోనాని తట్టుకోలేకపోయారు. ఇక ఇండస్ట్రీలో కార్మికుల సన్నివేశాన్ని ఊహించుకుంటే భయానక నిజాలెన్నో ఉన్నాయి.