Begin typing your search above and press return to search.
'సరిలేరులే మీకెవ్వరూ..' ఫైట్ దించేశారుగా!
By: Tupaki Desk | 8 Jan 2021 1:16 PM GMTటాలెంట్ ఎన్నో రూపాల్లో ఉంటుంది.. అది ప్రపంచానికి చాటడానికి మాత్రం ఓ వేదిక కావాలి. డిజిటలైజేషన్ పెరిగిన తర్వాత టిక్‌టాక్, యూట్యూబ్ వంటివి మాధ్యమాలతో మరుగున పడిపోయిన టాలెంట్ వెలుగు చూస్తోంది. కొందరు సరదా కోసం వీడియోలు చేస్తుంటే.. మరికొందరు తమ టాలెంట్ ను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ క్రమంలో యూట్యూబ్ లోకి వచ్చిన కొన్ని వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. లేటెస్ట్ గా వరంగల్ జిల్లా తోపనపల్లి గ్రామానికి చెందిన కిడ్స్ చేసిన 'సరిలేరు నీకెవ్వరు' ఫైట్ స్పూఫ్ వైరల్ అయ్యింది. పిల్లలు చేసిన ఈ ఫైట్ నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.
సినిమాలో కర్నూల్‌లోని కొండారెడ్డి బురుజు ఫైట్ సీన్‌ను తమదైన స్టైల్లో తెరకెక్కించారు. నెటిజన్లను ఈ ఫైట్ విశేషంగా అలరించడంతో యూట్యూబ్‌లో వ్యూస్ భారీగా పెరిగిపోతున్నాయి. పోస్ట్ చేసిన నెల రోజుల్లోనే 5.7 లక్షల మంది వీక్షించారు. 'కేవీ క్రియేషన్స్' అనే యూట్యూబ్ చానెల్‌లో పోస్టు చేసిన ఈ లోకల్ టాలెంట్ వీడియో ఓ రేంజ్ లో ఉంది.
ఈ వీడియోతోపాటు 'నెల్లూరు కుర్రాళ్లు ఎల్‌కే ఎటర్‌టైన్మెంట్' అనే చానెల్‌లో పోస్ట్ చేసిన 'రమణా లోడ్ ఎత్తాలిరా' అంటూ ఇప్పటికే ఫేమస్ అయిన అదే సినిమాలోని ఫైట్ కూడా అద్భుతమైన వ్యూస్ సాధించింది. ఈ వీడియోను సుమారు 2.5 మిలియన్ల మంది చూశారంటే.. ఎంత పాపులారిటీ సాధించిందో అర్థం చేసుకోవచ్చు.