Begin typing your search above and press return to search.
టాప్ స్టోరి: 100 కోట్ల షేర్ సీనుందా?
By: Tupaki Desk | 19 Jan 2020 5:27 AM GMTసంక్రాంతి పందెంలో గెలుపు ఎవరి వైపు మొగ్గు చూపింది? బాక్సాఫీస్ పోరులో ఎవరిది పైచేయి? ఎవరి సత్తా ఎంత? .. ప్రస్తుతం ఏ నోట విన్నా ఇదే డిస్కషన్. సరిలేరునీకెవ్వరు.... అల వైకుంఠపురములో ప్రమోషన్ మొదలు.. రిలీజ్ వార్.. గురించి తెలిసిందే. ఆ ఇరువురి నడుమ పోస్టర్ల వార్ అంతే ఇదిగా నడుస్తోంది. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ వార్ లో ఎవరికి వారు బెస్ట్ అంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఇప్పటికే బాక్సాఫీస్ వార్ క్లైమాక్స్ చేరుకునే సరికి పోస్టర్లతో వేడెక్కిస్తున్నారు. తాజాగా రెండు సినిమా యూనిట్లు రెండు కొత్త పోస్టర్లు రిలీజ్ చేసి మరోసారి అధిపత్యం చూపించుకునే ప్రయత్నం చేయడం జోక్ గానే మారింది. మొదటివారం ముగిసే సరికి 100 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించిందని సరిలేరు నీకెవ్వరు టీమ్ రిలీజ్ చేసింది. దీంతో అల టీమ్ మేం అంతకు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్లు ఆరు రోజుల్లోనే 104 కోట్లు షేర్ సాధించిందని కౌంటర్ గా మరో పోస్టర్ ని రిలీజ్ చేసారు.
ఈ రిజల్ట్ నిజమేనా? బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల షేర్ సాధ్యమైందా? అంటే.. ఇవన్నీ ఫేక్ లెక్కలు అంటూ విమర్శలు ఎదురవుతున్నాయి. వంద కోట్ల వసూళ్లు అంటే అంత ఈజీనా? ఎన్నో సందేహాలు తలెత్తుతున్నాయి. రెండు సినిమాలకు డివైడ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన సినిమాలు ఓపెనింగ్ డే మంచి వసూళ్లతో శుభారాంభాన్ని ఇచ్చాయి. సూపర్ స్టార్ మహేష్ ఇమేజ్...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ఓపెనింగ్ వీకెండ్ బాగానే కుదిరింది. స్టార్ హీరోల కాబట్టి మొదట్లో ఆ ఊపు కనిపిస్తుంది. అలాగే బాక్సాఫీస్ వద్ద సరిలేరు పై అల వైకుంఠపురములో డామినేషన్ స్టడీగా కనిపిస్తోందన్న టాక్ ట్రేడ్ లో వినిపించింది. ప్రస్తుతం ఈ సినిమాల పరిస్థితి ఎలా ఉంది? అన్నది చూస్తే సంక్రాంతి సెలవులు అయిపోయాక.. వసూళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయన్న వార్త ఇప్పుడు వెడెక్కిస్తోంది. అల వైకుంఠపురములో తొలి నుంచి పాజిటివ్ టాక్ రావడం..తో స్టడీగా వసూళ్లు సాధిస్తున్నా డివైడ్ టాక్ ఎఫెక్ట్ సరిలేరుపై స్పష్ఠంగా కనిపిస్తోందన్నది ఓ విశ్లేషణ.
దీంతో సరిలేరు నీకెవ్వరు బ్రేక్ ఈవెన్ కూడా కష్టమేనని టాక్ వినిపిస్తోంది. సరిలేరు కొత్త పోస్టర్ లో వేసిన నంబర్ కు...సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఏరియా వైజ్ లెక్కలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. వారం రోజుల్లో సరిలేరు 85.56 కోట్ల షేర్ వస్తే పోస్టర్ హైప్ ఆశ్చర్యపరిచింది. అల వైకుంఠపురములో షేర్ 77.71 కోట్లు అన్న ప్రచారం సాగుతోంది. కానీ పోస్టర్ లో మాత్రం ఒకరేమో 100 కోట్లు షేర్ అని.. మరొకరు 104 కోట్లు షేర్ అని పోస్టర్లు వేయడంతో నెటిజనులు కామెంట్లు..మీమ్స్ తో చెలరేగిపోతున్నారు. కేవలం పోటీ వల్ల.. ఆధిపత్య పోరు వల్లనే ఈ పోస్టర్ వార్! అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పోస్టర్లు చూసి నిజంగా ఆ హీరోలిద్దరికీ 100 కోట్ల షేర్ (సుమారు 200కోట్ల గ్రాస్) తెచ్చే సీన్ ఉందా? అంటూ అనుమానం వ్యక్తమవుతోంది.