Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూసివ్ : అనిల్ రావిపూడి తో తుపాకీ డాట్ కామ్ స్పెషల్ చిట్ చాట్

By:  Tupaki Desk   |   14 Jan 2020 3:30 AM GMT
ఎక్స్ క్లూసివ్ : అనిల్ రావిపూడి తో తుపాకీ డాట్ కామ్ స్పెషల్ చిట్ చాట్
X
ఫన్ అంటే తనకి చాల ఇష్టమని చెబుతున్న అనిల్ రావిపూడి తన సినిమాల్లో కూడా అది మిస్ కాకుండా చూసుకుంటున్నాడు. సరిలేరు నీకెవరుతో పర్ఫెక్ట్ పండగ సినిమాని ప్రేక్షకులకి అందించిన ఈ యంగ్ డైరెక్టర్ తో తుపాకీ రీడర్స్ కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూ

* ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి, సరిలేరు విషయం లో మీరు ఫేస్ చేసిన ఎఫ్ 2 మూమెంట్స్ ?

(ఒక పెద్ద నవ్వు తరువాత సమాధానం మొదలైంది) ఎఫ్ 2 ని సరిలేరుతో భలే లింక్ చేసారు. ఏ రెండిటిలో ఉన్న కామన్ పాయింట్ కామెడీ, అలానే రెండూ కమర్షియల్ ఎంటెర్టైనెర్స్, మరి ముఖ్యం గా రెండూ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నాయి, అంటే సరిలేరు నీకెవరు కి ఇంకా పెద్ద హిట్ అవుతుంది అని నా నమ్మకం, ఆల్రెడీ 100 కోట్లు పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక మీరు అడిగినట్లు గా సరిలేరు షూటింగ్ మొత్తం నేను ఎంజాయ్ చేశాను, ఫ్రస్ట్రేషన్ వచ్చేంత సందర్భాలు ఎప్పుడు నాకు ఈ సినిమా విషయం లో ఎదురవ్వలేదు.

* సరిలేరు లో కామెడీ, కమర్షియల్ ఎలెమెంట్స్ పైన్ ఎక్కువ ద్రుష్టి పెట్టి, ఎమోషన్స్ పై ఫోకస్ తగ్గినట్లు అనిపించింది?

ఈ సినిమా మొత్తానికి నేను ఒక సన్నివేశం లో మాత్రమే ఎమోషన్ పెట్టాలి అనుకున్నాను, ఎందుకంటె ఈ కథ ఆ ఒక్క సందర్భం తప్పితే మిగిలిన చోట ఎమోషన్స్ ని కి అంతగా ప్రాధాన్యత ఉండదు. కామెడీ, కమర్సియాలిటీ తో పాటు ఒక చిన్న మెసేజ్ ని కూడా సినిమాలో బ్లెండ్ చేసాము. అన్ని ఏర్చి పేర్చి సినిమాని కూర్చే సరికి మీరు అన్నట్లుగా నా గత సినిమాలు కంటే ఈ సినిమాలో కొంత మేర ఎమోషనల్ కంటెంట్ తగ్గింది.

* కమర్షియల్ జానర్ లోనే సినిమాలు చేస్తున్నారు, మొనాటనీ వచ్చే అవకాశం ఉంది కదా ?

ఎస్ మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటాను, మొదటి నుంచి నా ఫోకస్ మొత్తం కమర్షియల్ సినిమాలు పైనే ఉంది, నాకు మొనాటనీ వచేస్తుందేమో అని భయం ఉంది కానీ నేను ఈ జానర్ నుంచి బయటకు వచ్చి వేరే సినెమలి చేసిన అందులో కూడా ఫన్ మాత్రం మిస్ అవ్వను, జెన్యూన్ గా కూడా నేను చాలా సరదాగా ఉండటనికి ఇష్టపడతాను.

* అసలు మీరు టెన్షన్ యే పడరు అని మహేష్ చెబుతున్నారు, ఇది ఎలా అలవాటు అయ్యింది?

నేను టెన్షన్ పడతాను కాని పైకి కనిపించకుండా జాగ్రత పడతాను, నా టెన్షన్ మిగతా వారికీ టెన్షన్ కాకుండా ఉంటె చాలు. సరిలేరు నీకెవరు సినిమా ని అయిదు నెలల్లో రెడీ చేశాను, ఈ షూట్ టైం లో నన్ను, నా వర్క్ స్టైల్ ని గమనించి మహేష్ గారు ఈ మాట చెప్పి ఉంటారు.

* అసలు ఫ్లోప్స్ లేని డైరెక్టర్స్ బ్యాచ్ లోకి మీరు ఎంటరయ్యారు, మీ నెక్స్ట్ సినిమాలు ఇక స్టార్ హీరోలతోనే అనుకోవచ్చా?

అసలు నా నెక్స్ట్ సినిమాలు స్టార్ హీరోలతో చేస్తానో చేయనో అనేది కాసేపు పక్కన పెడితే నేను మాత్రం ఓ డైరెక్టర్ గా స్టార్ డం తీసుకోవడానికి చాలా భయపడుతున్న, భయం కాదు అసలు స్టార్ డం ని నా బుర్రకి ఎక్కించుకోవడం లేదు, మహేష్ గారి లాంటి హీరోతో సినిమా చేసి నేను వెంటనే ఒక మీడియం రేంజ్ హీరో లేదా చిన్న హీరోలతో సినిమా చేయడానికి నేను ఎల్లప్పుడు రెడీ.

* కొత్త వాళ్లతో కూడా సినిమా చేయడనికి హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి సిద్ధమేనా?

కథ కుదిరి అన్ని బాగుంటే నేను కొత్త వాళ్ళతో కూడా సినిమా చేయడనికి రెడీ. కేవలం నా కథ నమ్మి కళ్యాణ్ రామ్ గారి దగ్గర నుంచి మహేష్ గారికి వరకు అవకాశాలు ఇచ్చారు. కథ బాగుంటే కొత్త వాళ్ళని డైరెక్ట్ చేయడనికి నేను సిద్ధం గానే ఉన్నా.

* వరుసగా ఈ సంక్రాంతికి కూడా హిట్ అందుకున్నారు, పండగ టైం లో మీ సినిమాలు ఉండేలా చుస్కుంటున్నారా లేక ఇది అల జరిగిపోతుందా?

పండుగ టైం లో నా సినిమా ఉండాలి అని నేను ఫోకస్ పెట్టి సినిమాలు చేసిన సందర్బాలు లేవు అండి కానీ రాజా ది గ్రేట్ నుంచి అల కలిసి వస్తుంది, ఐతే సరిలేరు నీకెవరు ని మాత్రం పండగకి రిలీజ్ చేయాలి అని ముందే అనుకున్నానం. ఈ సీసన్ కి తగ్గట్లుగానే ఈ సినిమాని రెడీ చేసాము.

* మహేష్ గారి భుజాలు పైనే సినిమా మొత్తం నడిపించారు, కామెడి కూడా ఆయనతోనే పండించారు ఎందుకలా?

మహేష్ గారు ఈ మధ్య చేసిన సినిమాలు అన్నిట్లో అయన నటనకి కొంత పరిమతిలు ఉంటాయి కానీ సరిలేరు లో మాత్రం అయన క్యారెక్టర్ కి ఎలాంటి బోర్డర్స్ ఉండవు రియల్ మాస్ హీరో పాత్ర ఇది. అందుకే సినిమా చూసినప్పుడు మొత్తం ఆయనే కనిపిస్తాడు, నిజానికి సినిమా ఇంత హిట్ అవ్వడానికి మహేష్ గారి పవర్ఫుల్ యాక్షన్ ముఖ్య కారణం.

* సక్సెస్ క్రెడిట్ మొత్తం మహేష్ గారికి ఇచ్చేసారు ఐతే?

అయన వల్లే సరిలేరు నీకెవరు నెవెర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ రేంజ్ లో బ్లాక్బస్టర్ దిశగా పరుగులు తీస్తుంది.

* మీరు అనుకున్నట్లుగా సరిలేరు నీకెవరు మీకు ఎవర్ లాస్టింగ్ సక్సెస్ ఇవ్వాలని మా తుపాకీ డాట్ కామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అల్ ది బెస్ట్

థాంక్యూ అండి, తుపాకీ రీడర్స్ అంత సరిలేరు నీకెవరు సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయన్లని కోరుకుంటున్నాను