Begin typing your search above and press return to search.
టీఆర్పీ రేటింగ్స్ లో సరిలేరు అనిపించుకుంటున్న మహేష్...!
By: Tupaki Desk | 9 July 2020 10:10 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో బ్లాక్ బస్టర్ గా బాప్ అనిపించుకున్నాడు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా సిల్వర్ స్క్రీన్ పై రికార్డ్స్ క్రియేట్ చేయడమే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా సత్తా చాటింది. మార్చి 25న ఉగాది పండుగ సందర్భంగా జెమిని ఛానల్ లో ప్రసారమైన ‘సరిలేరు నీకెవ్వరు’ రికార్డు స్థాయిలో టెలివిజన్ వ్యూవర్ షిప్ సాధించింది. 23.4 టీఆర్పీ రేటింగ్స్ సాధించి తెలుగు టెలివిజన్ చరిత్రలో హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ‘బాహుబలి 2’ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ 22.7 టీఆర్పీని దాటేసింది ‘సరిలేరు నీకెవ్వరు’.
ఇదిలా ఉండగా జూన్ 28న బుల్లితెరపై జెమినీ ఛానల్ లో రెండో సారి ప్రసారం అయింది. ఈసారి 17.4 టీఆర్పీని రాబట్టి అదరగొట్టింది. మాస్ ఎంబీ మేనియా అంటూ ఈ విషయాన్ని మేకర్స్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. సెకండ్ టైం టెలికాస్ట్ అయిన మూవీస్ లో అత్యధిక టీఆర్పీ రాబట్టిన సినిమాల లిస్ట్ లో 'ఫిదా' 'గీత గోవిందం' చిత్రాల తర్వాత ప్లేస్ లో ‘సరిలేరు నీకెవ్వరు’ నిలిచింది. కాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాని దిల్ రాజు - మహేష్ బాబు - అనిల్ సుంకర నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, వెన్నెల కిషోర్, సత్యదేవ్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు.