Begin typing your search above and press return to search.
ఎక్స్ క్లూజివ్: అందుకోసమే సరిలేరు ఎత్తు..అల పై ఎత్తు!
By: Tupaki Desk | 2 Jan 2020 1:30 AM GMTసంక్రాంతి పోటీలో రిలీజ్ అవుతున్న మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు'.. అల్లు అర్జున్ 'అల వైకుంఠపురములో' సినిమాలు విడుదల తేదీల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. 'సరిలేరు నీకెవ్వరు' 11 తేదీన రిలీజ్ అవుతుండగా 'అల వైకుంఠపురములో' 12 న వస్తాయనేది గతంలో ఉన్న అండర్ స్టాండింగ్. ఇప్పుడు బన్నీ టీమ్ తమ సినిమాను 10 వ తారీఖున విడుదల చేయాలని ప్రకటించడం వెనక 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఎక్కువ థియేటర్ల కోసం ప్రయత్నించిన వ్యవహారాలు కారణమట.
సరిలేరు 11 వ తేదీ రిలీజ్ అయితే దాదాపు అన్ని థియేటర్స్ లో మహేష్ సినిమానే ఉంటుంది. అయితే 12 న బన్నీ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి బన్నీ సినిమాకు ఎక్కువ థియేటర్లు ఇస్తామని 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ ఒప్పుకున్నారట. అయితే తర్వాత మాత్రం తమ సినిమాకు ఎక్కువ థియేటర్లు తమకే కావాలని ఎగ్జిబిటర్లపై ఒత్తిడి పెంచారట. ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతితో తమ సినిమాకు రెండో రోజు కూడా ఎక్కువ థియేటర్లు ఉండాలని డైరెక్ట్ గా థియేటర్ల ఓనర్లతో మాట్లాడుతున్నారట.
ముందు రెండు సినిమాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 11 న మహేష్ సినిమా ఎన్ని థియేటర్లలో ప్రదర్శిస్తారో.. తర్వాత రోజుల్లో ఆన్నిథియేటర్లలో బన్నీ సినిమాను ప్రదర్శించే అవకాశం ఇవ్వాలట. ఉదాహరణకు ఒక మల్టిప్లెక్స్ లో నాలుగు స్క్రీన్స్ ఉన్నాయి అనుకోండి. 11 న మూడు స్క్రీన్స్ లో మహేష్ సినిమాను ప్రదర్శిస్తారు. 12 న మెయిన్ స్క్రీన్ లో మహేష్ సినిమానే ఉంటుంది.. మరో రెండు బన్నీ సినిమాకు ఇస్తారు. ఇందులో ఒకటి మెయిన్ థియేటర్ రెండోది సబ్ థియేటర్. అయితే 12 న రోజు బన్నీ సినిమాకు ఒక థియేటర్ తగ్గింది కాబట్టి 13 వ తేదీన ఒక స్క్రీన్ ఎక్కువ ఇచ్చి కవర్ చేస్తారు. ఇక 14 వ తారీఖు నుంచి రెండు సినిమాలకు సమానంగా స్క్రీన్ కౌంట్ ఉంటుంది. ఇలా అగ్రిమెంట్ చేసుకున్నారు.
అయితే ఇప్పుడు వచ్చిన చిక్కేంటంటే.. మహేష్ టీమ్ తమ సినిమాకు 11 వ తేదీ ఎన్ని స్క్రీన్స్ ఉన్నాయో 12 కూడా అన్ని స్క్రీన్స్ ఉండాలని పట్టుబడుతున్నారట. 13 నుంచి బన్నీ సినిమాకు అవకాశం ఇస్తాము అంటున్నారట. ఈ విషయంతో బన్నీ అండ్ టీమ్ అప్సెట్ అయ్యారని.. ఇలా జరిగితే తమ సినిమాకు ఓపెనింగ్ కలెక్షన్స్ లో నష్టం జరుగుతుందని భావించి జనవరి 10 న రిలీజ్ చేస్తామంటూ 'సరిలేరు నీకెవ్వరు' టీమ్ కు ఊహించని విధంగా పెద్ద ఝలక్ ఇచ్చారని సమాచారం. జటిలమైన ఈ సమస్యను ఎవరు పరిష్కరించే ప్రయత్నం చేస్తారో.. ఎలా పరిష్కారం అవుతుందో వేచి చూడాలి.