Begin typing your search above and press return to search.
డిసెంబర్ వరకూ మహేష్ రానన్నారా?
By: Tupaki Desk | 21 Jun 2020 4:00 AM GMTసమ్మర్ అయిపోయింది. రుతుపవనాలొచ్చాయి. సినిమాలేవీ రిలీజ్ కి రాలేదు. మహమ్మారీ దెబ్బకు ప్లాన్ అంతా ఫ్లాపైంది. అన్నీ మూలన పడ్డాయి. ఇకపై దసరా.. క్రిస్మస్.. సంక్రాంతి ఉన్నాయి. ప్రస్తుత క్రైసిస్ సన్నివేశం ఎప్పటికి ప్రశాంతతను తెస్తుంది? అన్నది అర్థం కాని పరిస్థితి. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరుగుతుంటే సినిమా వాళ్లలో ఒకటే టెన్షన్. దసరా నాటికి అయినా సన్నివేశం అదుపులోకి వస్తుందా? అన్న టెన్షన్ అందరిలో ఉంది. ముఖ్యంగా సినిమా వాళ్లలో ఏజ్డ్ హీరోలు యువహీరోలు అనే తేడా లేకుండా అందరిలోనూ ఒకటే టెన్షన్ వాతావరణం అలుముకుంది. పైకి చెప్పకపోయినా.. బతికుంటే బలుసాకు తిని బతుకుదాం! అన్నట్టుగానే ఉంది పరిస్థితి.
షూటింగులకు ప్రభుత్వాల నుంచి అనుమతులు వచ్చేసినా కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. మన హీరోలు ఎవరూ షూటింగులకు వెళ్లే ఆలోచనలో లేనే లేరు. చిరంజీవి- వెంకటేష్- నాగార్జున- మహేష్- రామ్ చరణ్ - ఎన్టీఆర్.. వీళ్లలో ఎవరూ ఆసక్తిగా లేరు. పైగా మహమ్మారీ ప్రభావం తగ్గే వరకూ తాము సెట్స్ కి రాలేమని కూడా చెప్పేశారు కొందరు హీరోలు. చిరంజీవి .. వెంకీ వేచి చూసే ధోరణితోనే ఉన్నారని ఇదివరకూ వార్తలొచ్చాయి.
ఇప్పుడు అదే బాటలో మహేష్ కూడా సెట్స్ కి రాలేనని చెప్పేశారట. డిసెంబర్ వరకూ రాలేను. 2021లోనే చూద్దామని సర్కారు వారి పాట యూనిట్ కి చెప్పేశారట. దీంతో పరశురామ్ అండ్ టీమ్ ఆ మేరకు షెడ్యూల్స్ ని మార్చుకోవాల్సి ఉంటుందని తెలిసింది. ఈలోగా ఏదైనా ప్రత్యామ్నాయ ఆలోచన చేసుకోవాలని మహేష్ సూచించారట.
చిరంజీవి - రామ్ చరణ్ ఇప్పటికే కొరటాలకు ఇదే విధంగా చెప్పారట. మహమ్మారీ గ్రాఫ్ తగ్గే వరకూ వేచి చూడాలని సూచించారట. విక్టరీ వెంకటేష్ - డి.సురేష్ బాబు బృందం ఇలానే ఆలోచిస్తున్నారు. తాజా సన్నివేశం చూస్తుంటే దసరాకి కష్టమే.. క్రిస్మస్ లేదా సంక్రాంతి నాటికి ఏదైనా క్లారిటీ వస్తుందేమో. ఇటీవల వరుసగా వ్యాక్సిన్ తయారీదారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు కాబట్టి వీటిలో ఏదైనా వర్కవుటైతే బావుంటుందనే అంతా భావిస్తున్నారు. గ్లెన్ మార్క్ కంపెనీ కరోనా ప్రాథమిక మధ్యస్థ దశలో ఉన్నప్పుడు నివారణకు ఫవిపిరవిర్-ఉమిఫెనోవిర్ అనే రెండు యాంటీ బయోటిక్ టాబ్లెట్లను మార్కోట్లోకి తెస్తోంది. దీనికి అధికారికంగా డ్రగ్ కంట్రోల్ విభాగం సహా ప్రభుత్వ ఆమోదం లభించనుంది. పలువురు వ్యాక్సిన్లు కనుగొన్నామని ప్రకటించినా అవన్నీ వచ్చేందుకు మరో ఏడాది సమయం పట్టనుంది.