Begin typing your search above and press return to search.
మురుగదాస్.. ఊపిరి పీల్చుకోవచ్చు
By: Tupaki Desk | 9 Nov 2018 4:55 PM GMTతమిళ స్టార్ హీరో విజయ్.. టాప్ డైరెక్టర్ మురుగదాస్ ల కలయికలో వచ్చిన కొత్త సినిమా ‘సర్కార్’పై తమిళనాట పెద్ద వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్ పోషించిన విలన్ పాత్రకు కోమలవల్లి అనే పేరు పెట్టడం వివాదాస్పదమవుతోంది. అది మాజీ ముఖ్యమంత్రి జయలలిత అసలు పేరు. ఈ సినిమాలో అధికార అన్నాడీఎంకేతో పాటు ఇతర ప్రధాన పార్టీల మీద కూడా పెద్ద ఎత్తున సెటైర్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్ ను నిన్న అర్ధరాత్రి అరెస్టు చేయడానికి ప్రయత్నం చేయడం తెలిసిందే. దీంతో మురుగదాస్ ముందస్తు బెయిల్ కోసం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. కోర్టు అతడికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
ఈ నెల 27వ తేదీ వరకు మురుగదాస్ ను అరెస్టు చేయడానికి వీల్లేదని పోలీసుల్ని ఆదేశించింది. తాను ఎవరి మనోభావాల్ని దెబ్బ తీసే ఉద్దేశంతో ‘సర్కార్’ సినిమా తీయలేదని తన పిటిషన్లో మురుగదాస్ పేర్కొన్నాడు. సర్కార్ చిత్రాన్ని ప్రజలెవరూ వ్యతిరేకించట్లేదని.. ప్రభుత్వం మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తోందని.. అధికార పార్టీ వాళ్లే ఆందోళనలు చేపడుతున్నారని మురుగదాస్ అన్నాడు. మురుగదాస్ పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు ప్రస్తుత పరిస్థితుల్లో అతడిని అరెస్టు చేయడానికి వీల్లేదని పోలీసులకు స్పష్టం చేసింది. మరి 27వ తేదీ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి. అప్పటికి ‘సర్కార్’ సందడి ముగిసిపోతుంది కాబట్టి ఈ వివాదం కూడా సద్దుమణుగుతుందేమో.