Begin typing your search above and press return to search.
2018 సౌత్ ఇండియా బిగ్గెస్ట్ హిట్
By: Tupaki Desk | 19 Nov 2018 10:44 AM GMTతమిళనాట విజయ్, మురుగదాస్ ల కాంబినేషన్ హ్యాట్రిక్ దక్కించుకుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సర్కార్’ చిత్రం కూడా బ్లాక్ బస్టర్ వసూళ్లను దక్కించుకుని లాభాల వర్షం కురిపించింది. మొదటి వారాంతంలోనే ఈ చిత్రం 150 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రం లాంగ్ రన్ లో 140 కోట్ల షేర్ ను వసూళ్లు చేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా మరోసారి విజయ్ మూవీ 100 కోట్ల క్లబ్ లో చేరడంతో పాటు ఈ ఏడాదిలో సౌత్ ఇండియాలో అతి పెద్ద విజయాన్ని ‘సర్కార్’ దక్కించుకుంది.
‘సర్కార్’ చిత్రం తమిళనాడుతో పాటు ఓవర్సీస్ - కేరళ - తెలుగు రాష్ట్రాల్లో భారీగా వసూళ్లు రాబట్టింది. ‘సర్కార్’ కు ముందు వరకు అత్యధిక వసూళ్లతో ఈ ఏడాది సౌత్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ గా ‘రంగస్థలం’ ఉంది. రామ్ చరణ్ - సుకుమార్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం తెలుగులో ఇండిస్ట్రీ హిట్ ను దక్కించుకుంది. రంగస్థలం తర్వాత ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘సర్కార్’ నిలిచింది. 220 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను ‘సర్కార్’ సాధించినట్లుగా తెలుస్తోంది.
సర్కార్ 2018 బిగ్గెస్ట్ హిట్ మూడు నాళ్ల ముచ్చటే కానుంది. ఈనెల చివర్లో రజినీకాంత్ - శంకర్ ల ‘2.ఓ’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆ చిత్రం ఈ సంవత్సరపు సౌత్ ఇండియా మాత్రమే కాదు, ఇండియాస్ బిగ్గెస్ట్ సక్సెస్ మూవీ అవుతుందని, అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలుస్తుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 2.ఓ వచ్చిన తర్వాత సర్కార్ రెండవ స్థానంకు వెళ్తే - రంగస్థలం మూడవ స్థానంలో నిలిచే అవకాశం ఉంది.