Begin typing your search above and press return to search.

స‌ర్కార్ టార్గెట్ 200కోట్లు?

By:  Tupaki Desk   |   1 Nov 2018 4:19 AM GMT
స‌ర్కార్ టార్గెట్ 200కోట్లు?
X
ఈ దీపావ‌ళికి మోస్ట్ అవైటెడ్ సౌత్ మూవీగా రిలీజ‌వుతోంది `స‌ర్కార్`. ఇల‌య‌ద‌ళ‌పతి విజ‌య్- ఏ.ఆర్‌.మురుగ‌దాస్ సెన్సేష‌న‌ల్ కాంబినేష‌న్‌ లో తెర‌కెక్కిన‌ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రమిది. న‌వంబ‌ర్ 6న ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. సౌతిండియా రికార్డుల‌న్నిటినీ తిర‌గ‌రాసే రేంజులో స‌ర్కార్‌ రిలీజ్ ప్లాన్ చేయ‌డం స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిస్తోంది. విజ‌య్‌- మురుగ టీమ్ బాహుబ‌లి రికార్డుల్ని బ్రేక్ చేయాల‌న్న పంతంతో ఉన్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి.

అందుకు త‌గ్గ‌ట్టే బాహుబ‌లి త‌ర‌హాలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాదాపు 10వేల స్క్రీన్ ల‌లో రిలీజ్ చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నార‌ట‌. అది కూడా ఇండియా స‌హా అమెరికాలో ఒకే తేదీ(న‌వంబ‌ర్ 6)కి రిలీజ‌వుతోంది. అంటే ఒక రోజు ముందు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రీమియ‌ర్ల‌ను ఘ‌నంగా ప్లాన్ చేశార‌ని తెలుస్తోంది. త‌మిళ‌నాడు - ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ - తెలంగాణ‌ - కేర‌ళ‌ - క‌ర్నాట‌క‌లో ఒకేసారి ఈ చిత్రం రిలీజ‌వుతోంది.

అందుకు త‌గ్గ‌ట్టే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ దాదాపు 107కోట్ల మేర‌కు సాగించిందిట‌. త‌మిళ‌నాడు-83కోట్లు - కేర‌ళ‌-8కోట్లు - క‌ర్నాట‌క -8కోట్లు - ఏపీ-6కోట్లు - తెలంగాణ‌-2కోట్లు మేర ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా దాదాపు రూ.150-200కోట్ల గ్రాస్‌ ని కేవ‌లం త‌మిళ‌నాడు నుంచే వ‌సూలు చేస్తుంద‌ని త‌మిళ క్రిటిక్ ర‌మేష్ బాలా అంచ‌నా వేస్తున్నారు. మురుగ‌దాస్ ఇమేజ్‌ తో ఇరుగుపొరుగు రాష్ట్రాల్లోనూ బాగానే ఆడుతుంద‌న్న న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి స‌ర్కార్ సెగ గ‌ట్టిగానే ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌చారం మాత్రం పూర్తిగా జీరో. స‌రైన మీడియా ఇంట‌రాక్ష‌న్ కానీ - హ‌డావుడి కానీ లేదిక్క‌డ‌. మ‌రి ఏపీ - నైజాంలో ఎలాంటి వ‌సూళ్లు ద‌క్కించుకుంటుందో వేచి చూడాలి. ప్ర‌ఖ్యాత స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.