Begin typing your search above and press return to search.
'సర్కార్' మైండ్ బ్లోయింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్
By: Tupaki Desk | 5 Nov 2018 11:37 AM GMTతమిళ సూపర్ స్టార్ విజయ్ హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్కార్’ చిత్రం రేపు దీపావళి సందర్బంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళలో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 3000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ చిత్రంకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో అన్ని ఏరియాల్లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ ఎత్తున జరిగింది. థియేట్రికల్ రైట్స్ - డబ్బింగ్ రైట్స్ ద్వారా మొత్తంగా 185 కోట్ల మేరకు ‘సర్కార్’ చిత్రం ఇప్పటికే రాబట్టినట్లుగా తమిళ ట్రేడ్ వర్గాల నుండి సమాచారం అందుతుంది.
సన్ నెట్వర్క్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం విజయ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లను నమోదు చేయబోతున్నట్లుగా తమిళ సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు. అందుకే కేవలం తమిళనాడులోని థియేట్రికల్ రైట్స్ ద్వారా 81 కోట్లు నిర్మాతలకు దక్కినట్లుగా సమాచారం అందుతుంది. ఇక ఇతర రాష్ట్రాల్లో మరియు శాటిలైట్ రైట్స్ ద్వారా కూడా పెద్ద మొత్తంలో సర్కార్ కొల్లగొడుతున్నట్లుగా తెలుస్తోంది. విజయ్ కి పెద్దగా మార్కెట్ లేని తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం 7.5 కోట్లకు అమ్ముడు పోయిందంటే ఈ చిత్రం ఏ స్థాయిలో క్రేజ్ ను కలిగి ఉందో చెప్పుకోవచ్చు.
కేవలం ఇండియాలో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా 105.5 కోట్ల బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం భారీగా అమ్ముడు పోయింది. తమిళ ప్రజలు విదేశాల్లో పెద్ద మొత్తంలో ఉంటారు. అందుకే ఈ చిత్రం విదేశాల్లో దాదాపు 30 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 135 కోట్లకు అమ్ముడు పోయిందట. ఇక శాటిలైట్ - ప్రైమ్ వీడియో - డబ్బింగ్ రైట్స్ ద్వారా 50 కోట్లు నిర్మాతల ఖాతాలో పడ్డట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 185 కోట్లు విడుదలకు ముందే నిర్మాతలు దక్కించుకున్నారు. సినిమా విడుదలై సక్సెస్ అయితే నిర్మాతలకు కాసుల పంట పండినట్లే అంటూ ట్రేడ్ వర్గాల వారు విశ్లేషిస్తున్నారు.