Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: మురుగా ఈజ్ బ్యాక్
By: Tupaki Desk | 19 Oct 2018 2:09 PM GMTడౌట్ లేకుండా ఏఆర్ మురుగదాస్ ఒక బ్రిలియంట్ ఫిలింమేకర్. ఒక '7th సెన్స్' వచ్చిందనో లేదా మరో 'స్పైడర్' తో షాక్ ఇచ్చాడనో మురుగదాస్ ను తక్కువగా అంచనా వెయ్యలేం. తమిళ ప్రేక్షకులకు మురుగా మీద అనుమానం లేదు తెలుగు వాళ్ళకు మాత్రం ఇప్పుడు ఉంది. కారణం 'స్పైడర్'. ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది.. డార్క్ హార్స్ అని.. టాలెంటెడ్ అని అందరికీ తెలుసుగానీ సక్సెస్ సాధిస్తాడని నమ్మకం ఉండదు.. వాళ్లనే డార్క్ హార్స్ అంటారు. తెలుగువాళ్ళ దృష్టిలో మురుగా పరిస్థితి ఇప్పుడు అదే.
ఇప్పుడు ఈ ఇంట్రో అంతా ఎందుకంటే మురుగా-విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సర్కార్'. ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితం రిలీజ్ అయింది. 1.33 నిముషాల ఈ టీజర్ లో విజయ్ ఒక ఎన్నారై బిజినెస్ మ్యాన్ గా కన్పించాడు. బ్యాక్ గ్రౌండ్ లో ఫస్ట్ డైలాగ్ ఇలా వవినిపిస్తూ ఉంటుంది.. "అవన్ ఒరు కార్పొరేట్ మాన్స్టర్.. ఎంద నాట్టుకు పోణాలో ఎదుటుంగళ అళచిటదా వెళ్ళపోవన్.. అవన్ ఇప్పో ఇండియా వందురుక్కా'(అయన ఓ కార్పొరేట్ రాక్షసుడు.. ఏ దేశానికి పోయినా కాంపిటీషన్ ను స్మాష్ చేసిగానీ వదిలిపెట్టడు. అయన ఇప్పుడు ఇండియా కు వచ్చాడు).
ఇక మీడియా అడిగితే... తాను ఏ కంపెనీని టేకోవర్ చేసేందుకు రాలేదని ఓటు వేసేందుకు మాత్రమే వచ్చానని అంటాడు. కానీ తాను వేయాల్సిన ఓటు వేరొకరు వేయడంతో అప్ సెట్ అవుతాడు. ఇక పొలిటికల్ ఎంట్రీ... రచ్చ స్టార్ట్. "మీరందరూ తీరిగ్గా కూర్చుని చూస్తూ ఉండండి.. పరిస్థితులు ఎలా మారతాయో.. నేనొక కార్పోరేట్ క్రిమినల్" అంటూ సీరియస్ గా చెప్తాడు. విజయ్ ఫైనల్ డైలాగ్ పవర్ఫుల్.. "గెట్ రెడీ ఫోక్స్.. ఉంగ ఊరు తలైవను తేడిపుడింగ... ఇదిదా నమ్మ సర్కార్"(మీ ఊరి నాయకుడిని వెతికి పట్టుకోండి.. ఇది మన ప్రభుత్వం).
ఇది కంప్లీట్ గా విజయ్ షో. విజయ్ స్టైలింగ్ అదరిపోయింది. ఒక ఫైట్ సీన్ లో ఎడం చేత్తో కుడి చేయిని తట్టి చూయింగ్ గమ్ ను నోట్లో వేసుకునే స్టైల్ మాత్రం అల్టిమేట్. రజినీ 2.0 అని మనం ఫిక్స్ అయిపోవచ్చు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ సూపర్. హీరోయిన్ కీర్తి సురేష్ కు పెద్దగా టీజర్ లో స్కోప్ లేదు. ఓవరాల్ గా విజయ్ స్టార్ ఇమేజ్ ను పాలిటిక్స్ ను మిక్స్ చేసి మురుగా మంచి మాస్ మసాలా దట్టించినట్టున్నాడు. ఇంకెందుకు ఆలస్యం 'సర్కార్' టీజర్ పారుంగ.. దళపతికి ఒరు విజిల్ పోడుంగ..!