Begin typing your search above and press return to search.
సర్కార్ తెలుగు టీజర్..వాయిస్ తుస్..!?
By: Tupaki Desk | 24 Oct 2018 4:08 AM GMT2018 మోస్ట్ అవైటెడ్ మూవీస్ జాబితాలో ఇలయదళపతి విజయ్ నటించిన `సర్కార్` మూవీ ఉందా.. లేదా? `మెర్సల్` చిత్రంతో 200కోట్ల క్లబ్ కథానాయకుడిగా రికార్డులు సృష్టించిన విజయ్ మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేస్తే కచ్ఛితంగా `సర్కార్` మోస్ట్ అవైటెడ్ కిందే లెక్క. ఏ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించిన సినిమాగా ఇది మోస్ట్ అవైటెడ్ మూవీగానే అభిమానులు భావిస్తున్నారు. కానీ ఎందుకనో తెలుగు నాట మాత్రం ఈ సినిమాకి అంతగా ప్రాచుర్యం రాలేదు. రిలీజ్‌కి ఇంకో 15రోజులు కూడా లేదు. అయినా ఈ సినిమాకి టాలీవుడ్ లో ఎక్కడా ప్రచారార్భాటమే కనిపించలేదు. ఇప్పటికైతే ఈ సినిమాని తమిళంలో బాగా ప్రమోట్ చేస్తున్నారు విజయ్ అభిమానులు.
ఇటీవలే రిలీజైన `సర్కార్` తమిళ టీజర్ కి అద్భుతమైన వ్యూస్ దక్కాయి. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ అని చెబుతున్న `థగ్స్ ఆఫ్ హిందూస్తాన్` - హాలీవుడ్ బ్లాక్ బస్టర్ `అవెంజర్స్: ఇన్ ఫినిటీ వార్` చిత్రాల టీజర్లను మించి `సర్కార్` టీజర్ కి యూట్యూబ్ లో ఆదరణ దక్కిందంటే అర్థం చేసుకోవచ్చు. విజయ్ ఫ్యాన్స్ ఆల్వేస్ సౌత్ ఇండియా టాప్ హీరోగా తమ అభిమాన కథానాయకుడిని నిలబెట్టడానికి పోటీపడుతూనే ఉన్నారు. రజనీకాంత్ తర్వాత విజయ్ అన్నంతగా పాపులారిటీని ఆపాదించారు. తాజాగా సర్కార్ తెలుగు టీజర్ రిలీజైంది.
``అతనొక కార్పొరెట్ మాన్ స్టర్.. ఏ దేశానికి వెళ్లినా తనని ఎదిరించిన వాళ్లను అంతం చేసి వెళతాడు! అతనిప్పుడు ఇండియాకు వచ్చాడు!`` అంటూ వరలక్ష్మి శరత్ కుమార్ వాయిస్ తో ఈ టీజర్ స్టార్టయింది. ``నేను ఏ కంపెనీ కొనడానికి రాలేదు.. ఇవాళ ఏ రోజు.. ఎలక్షన్ డే .. నేను నా ఓటు వేయడానికి వచ్చాను..`` అంటూ విజయ్ గొంతు వినిపించింది. ఆయన దొంగ ఓటు వేసారయ్యా...! అంటూ ఒకటే హడావుడి! ``ఇంకా ఒక్కరోజులో ఏం మారుతుందో మారబోతోందో మూల కూచుని వేడుక చూడండి.. ఐ యామ్ ఏ కార్పొరెట్ క్రిమినల్``, ``మీ ఊరి నాయకుడిని మీరే కనిపెట్టండి.. ఇదే మన `సర్కార్`` అంటూ ఓవరాల్ గా ఈ సినిమా జస్ట్ ఏంటో చెప్పేశారు టీజర్ లోనే. ఎలక్షన్ - ఓటు విలువ చెప్పే సినిమా ఇది. ఇండియాలో దగుల్బాజీ రాజకీయాల్ని ఎదురించే మొనగాడు వచ్చాక ఏం జరిగింది? అన్న పాయింట్‌తో ఏ.ఆర్.మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని టీజర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ టీజర్ స్టార్టయిన విధానం బోరింగ్. ముఖ్యంగా వరలక్ష్మి తెలుగు యాక్సెంట్ `తుస్..` మంది. వరలక్ష్మి తెలుగు డబ్బింగ్ చెప్పాలన్న ప్రయత్నం ప్రశంసనీయం కానీ పెర్ఫెక్షన్ లేకపోవడం మైనస్. ఇదివరకూ `పందెంకోడి 2`కి తన వాయిస్ పెర్ఫెక్ట్ గానే యాప్ట్ అయ్యింది. అయితే సర్కార్ టీజర్ వరకూ మాత్రం తన వాయిస్ అస్సలు బాలేదు. పెర్ఫెక్షన్ అన్నదే లేకుండా ఈ టీజర్ ని రూపొందించారు. మురుగదాస్ ఒక గొప్ప లైన్ తో సర్కార్ చిత్రాన్ని రూపొందించారు. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలని `పందెంకోడి 2` నిర్మాత ఠాగూర్ మధు ఇటీవల తన కార్యాలయంలో మాట్లాడుతూ ఆసక్తి కనబరిచారు. దీపావళి కానకగా సర్కార్ రిలీజవుతున్న సంగతి తెలిసిందే.